Studio18 News - అంతర్జాతీయం / : ఫుడ్ డెలివరీ చేసే అమ్మాయిని మోకాళ్లపై నిలబెట్టాడో సెక్యూరిటీ గార్డ్. తెల్లటి దుస్తులు ధరించి మోకాళ్లపై నిలబడిన ఆ అమ్మాయి ఫొటో చైనాను కదిలించింది. వందలాది మంది డెలివరీ ఏజెంట్ల ఆందోళనకు దిగారు. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ పారిశ్రామిక ప్రాంతం వద్ద ఒక మహిళా రైడర్‌ను మోకాళ్లపై నిలబెట్టి అవమానించారని ఆందోళనకారులు అంటున్నారు. ఓ మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఓ అమ్మాయి.. ఖాళీ సమయంలో ఫుడ్ డెలివరీ రైడర్‌గానూ పార్ట్‌టైమ్ పనిచేస్తోంది. ఫుడ్ డెలివరీ చేయడానికి తాజాగా ఝీఝీ సెంచరీ స్క్వేర్ వద్దకు వెళ్లింది. ఆమెను చూసిన సెక్యూరిటీ గార్డ్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె బైక్ కీని అతడు బలవంతంగా తీసివేసినట్లు తెలుస్తోంది. తాను తిరిగి ఆ కీ ఇవ్వాలంటే మోకాళ్లపై నిలబడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. అంతేగాక, డబ్బులు ఇవ్వాలని కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఈ ఫొటోను ఒకరు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వందలాది మంది డెలివరీ బాయ్స్ దీనిపై నిరసన తెలిపారు. సెక్యూరిటీ గార్డు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ గార్డు ఎవరికీ కనపడకుండా పారిపోయారు. ఆ ప్రాంతంలో ఫుడ్ డెలివరీని ఆపేశారు డెలివరీ ఏజెంట్లు.
Admin
Studio18 News