Monday, 15 December 2025 02:09:31 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Sheikh Hasina: మా అమ్మ ఆశ్రయంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదు: షేక్ హసీనా తనయుడు

Date : 07 August 2024 12:46 PM Views : 205

Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అమెరికా ప్రభుత్వం వీసాను రద్దు చేసిందని జరిగిన ప్రచారంపై ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ స్పందించారు. తన తల్లి ఏ దేశంలోనూ ఆశ్రయం కోరలేదని వెల్లడించారు. తన తల్లికి ఆశ్రయం ఇచ్చే విషయంలో అమెరికా, బ్రిటన్ స్పందించడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తన తల్లి ఆశ్రయానికి సంబంధించి మీడియాలో వివిధ కథనాలు వస్తున్నాయని, కానీ వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తన తల్లి అసలు ఏ దేశం ఆశ్రయం కోరలేదు కాబట్టి అమెరికా, బ్రిటన్ దేశాలు స్పందించలేదని చెప్పడం సరికాదన్నారు. తన తల్లికి ఆశ్రయంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఇదిలావుంచితే, భారత్ నుంచి బ్రిటన్ వెళ్లి తాత్కాలిక ఆశ్రయం పొందాలని షేక్ హసీనా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరికొన్నిరోజులు ఆమె భారత్‌లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేక్ హసీనా సోదరి రెహానా కూతురు తులిప్ సిద్దీఖ్ బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు. రెహానాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. అందుకే షేక్ హసీనా యూకే వెళ్లాలని భావిస్తున్నారు. అయితే నిన్న బ్రిటన్ హోంమంత్రి మాట్లాడుతూ, శరణార్థిగా వచ్చే వారికి తమ చట్టాలు అంగీకరించవని, అంతర్జాతీయ రక్షణ కోరేవారు తొలుత చేరుకున్న దేశంలోనే ఆశ్రయం అడగాలని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో షేక్ హసీనాకు అమెరికా వీసా రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హసీనా తనయుడు స్పందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :