Sunday, 16 March 2025 04:16:58 PM
# Omar Abdullah: జమ్మూకశ్మీర్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా # AP Govt: ఏపీ స‌ర్కార్ ఆసక్తికర నిర్ణ‌యం... ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు! # Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి # Chegondi Harirama Jogaiah: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ # Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్ # Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌...? # Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన # Revanth Reddy: చంద్రశేఖర్ రావ్... నీ పిల్లలకు చెప్పు... మాట జారితే ఫలితం అనుభవిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ # దేశంలో కులగణన చేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న మాయావతి సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని వ్యాఖ్య # Sovereign Bonds: వారి పంట పండింది... రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ # మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా # త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ # విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం # కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య చంద్రబాబుని # వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ # Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే! # Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు # Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు # Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ # Chiranjeevi: తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

Bangladeshis: భారత సరిహద్దుకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న బంగ్లాదేశీయులు

Date : 08 August 2024 11:14 AM Views : 84

Studio18 News - అంతర్జాతీయం / : పొరుగుదేశం బంగ్లాదేశ్ ఇంకా రగులుతూనే వుంది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ కి పారిపోయి వచ్చినప్పటికీ, అక్కడి విద్యార్థులు ఇంకా శాంతించడం లేదు. నిరసనలు, ఆందోళనల మధ్య లూటీలు, దాడులు యథేచ్చగా జరుగుతున్నాయి. కొన్ని వర్గాలకు చెందిన సంస్థలు, వ్యాపార సముదాయాలపై దాడులు కొనసాగుతున్నాయని వార్తలు వినబడుతున్నాయి. దీంతో తమ దేశంలో ఉంటే ప్రాణాలకు ముప్పు అని భావిస్తున్న వందలాది మంది బంగ్లాదేశీయులు ఆశ్రయం కోరుతూ భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు. బంగ్లాదేశ్ లోని పంచగఢ్ జిల్లాలోని ఓ అయిదు జిల్లాలు పశ్చిమ బెంగాల్ లో జల్ పాయిగుడీ సరిహద్దులోనే ఉంటాయి. దీంతో బంగ్లాదేశీయులు జల్ పాయి గుడీ లోని దక్షిణ్ బెరూబారీ గ్రామంలో ఉన్న ఔట్ పోస్టుకు చేరుకున్నారు. ఇనుప కంచె వద్దకు వచ్చిన బంగ్లాదేశీయులు అంతా తమ దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులను వివరించి భారత్ లో ఆశ్రయం కల్పించాలని వేడుకున్నారని అక్కడి స్థానికులు వెల్లడించారు. అయితే సరిహద్దు మొత్తం ఇనుప కంచెతో మూసి వేసి ఉండటంతో వాళ్లు భారత్ లోకి ప్రవేశించలేకపోయినట్లు బీఎస్ఎఫ్ దళాలు తెలిపాయి. అయితే బంగ్లా సరిహద్దు బలగాలు వారిని వెనక్కి తీసుకువెళ్లినట్లు తెలిపాయి. మరో పక్క బంగ్లాదేశ్ లో హింస చేలరేగిన నేపథ్యంలో ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. నాలుగు వేల కిలో మీటర్ల పొడవైన ఆ దేశంతో ఉన్న సరిహద్దులో బీఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కమాండర్లు క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బీఎస్ఎఫ్ చీఫ్ దల్జీత్ సింగ్ చౌధరి సైతం సరిహద్దు లోని జిల్లాకు చేరుకొని అధికారులతో సమావేశం నిర్వహించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :