Monday, 15 December 2025 02:23:09 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Doug Emhoff: అవును! మొదటి భార్యను మోసం చేశాను.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త ఒప్పుకోలు!

Date : 04 August 2024 11:50 AM Views : 328

Studio18 News - అంతర్జాతీయం / : అనూహ్యంగా అమెరికా అధ్యక్ష బరిలోకి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్తకు సంబంధించిన సంచలన విషయం ఒకదాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ ‘ద డెయిలీ మెయిల్’ ప్రచురించింది. కమల భర్త డగ్ ఎంహాఫ్‌ మొదటి భార్యను మోసం చేశారని రాసుకొచ్చింది. డగ్‌ ఇద్దరు పిల్లలు చదివే ప్రైవేటు పాఠశాలలో బోధించే అందగత్తె నానీ, నాజెన్ నైలర్‌తో ఆయనకు ఎఫైర్ ఉన్నట్టు పేర్కొంది. 15 ఏళ్ల క్రితం నాటి మాట ఇదని, ఆయన అప్పటికే కెర్‌స్టిన్‌ను వివాహం చేసుకున్నారని తెలిపింది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఒకరు దీనిని బయటపెట్టారని వివరించింది. అంతేకాదు, డగ్ కారణంగా నేలర్ గర్భం కూడా దాల్చారని, అయితే, దానిని ఆమె కొనసాగించలేదని తెలిపింది. కలకలం రేపిన ఈ కథనంపై డగ్ స్పందించారు. ‘సీఎన్ఎన్’తో ఆయన మాట్లాడుతూ.. నేలర్ పేరు, ఆమె గర్భం గురించి ప్రస్తావించకుండానే దీనిని అంగీకరించారు. తన చర్యల కారణంగా కెర్‌స్టిన్, తాను కొన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నట్టు గుర్తు చేసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. అయితే అ తర్వాత ఆ బంధం నుంచి బయటకు వచ్చినట్టు వివరించారు. మరోవైపు, కెర్‌స్టిన్ మాట్లాడుతూ.. డగ్, తాను వివిధ కారణాలతో చాలా ఏళ్ల క్రితమే తమ బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. తన పిల్లలకు ఆయన మంచి తండ్రి అని కితాబిచ్చారు. తమ మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోందని తెలిపారు. డగ్, కమలా హారిస్, తాను కలిసి నిర్మించుకున్న ప్రేమ పూర్వక బంధానికి నిజంగా గర్వపడుతున్నట్టు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :