Thursday, 05 December 2024 10:24:34 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Australia: ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయం.. భారతీయ విద్యార్థులపై ప్రభావం

Date : 28 August 2024 12:25 PM Views : 54

Studio18 News - అంతర్జాతీయం / : ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో ఒకటైన ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2025లో దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను 2.7 లక్షలకు తగ్గించింది. రికార్డు స్థాయిలో వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెల కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిమితం చేయనున్న సీట్లకు సంబంధించి ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ట్రైనింగ్ కోర్సులు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్ ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు. ఈ పరిణామంపై ఆస్ట్రేలియా మైగ్రేషన్ ఏజెంట్ల రిజిస్ట్రేషన్ అథారిటీ సభ్యుడు సునీల్ జగ్గీ స్పందించారు. విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని 2022లో ఆస్ట్రేలియా 5.10 లక్షలకు పరిమితం చేసిందని, ఈ సంఖ్యను 2023లో 3.75 లక్షలకు కుదించిందని ప్రస్తావించారు. వార్షిక ప్రణాళికల్లో భాగంగా విదేశీ విద్యార్థుల సంఖ్యను తాజాగా మరింత తగ్గించారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గింపు అంతర్జాతీయ విద్యార్థులు అందరికీ వర్తిస్తుందని, భారతీయ విద్యార్థులకు మాత్రమే కాదని అన్నారు. ఆస్ట్రేలియాలో చదువు కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి‌లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న విద్యార్థులపై ఈ ప్రకటన ప్రభావం చూపుతుందని, పంజాబ్‌కు చెందిన విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతారని ఆయన అంచనా వేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :