Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమలాహారిస్ పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కమలాహారిస్ ఘాటుగా ప్రతిస్పందించారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడేవారంతా తన దృష్టిలో పిరికివారేనని ఆమె అన్నారు. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థిని దెబ్బకొట్టడం అనేది నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రజల బాగు కోసం ఆలోచించేవారే నిజమైన నాయకులని అన్నారు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Admin
Studio18 News