Studio18 News - అంతర్జాతీయం / : Taslima nasreen : కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత ఆమె దేవి విడిచిపెట్టింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్ (యునైటెడ్ కింగడమ్) కు వెళ్లొచ్చని వార్తలు వచ్చాయి. తాజా ఘటనపై రచయిత్రి తస్లీమా నస్రీన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సి రావడానికి ఆమెనే బాధ్యురాలు. దేశంలో ఇస్లాంవాదులను ఎదిగేలా ఆమె చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లా మారకూడదు. సైన్యం పాలించకూడదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని తీసుకురావాలని ఆమె పోస్టు చేశారు. మరో పోస్టులో.. 1999లో నేను బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇస్లామిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు హసీనా నన్ను మా దేశం నుండి వెళ్లగొట్టింది. ఆమె మరణశయ్యపై ఉన్న మా అమ్మను చూసేందుకు, నన్ను మళ్లీ దేశంలోకి ప్రవేశించనివ్వలేదు. ఈ రోజు హసీనాను దేశం విడిచి వెళ్లేలా చేసిన విద్యార్థి ఉద్యమంలో కూడా అదే ఇస్లాంవాదులు ఉన్నారు అంటూ పోస్టు చేసింది.
Admin
Studio18 News