Thursday, 05 December 2024 09:44:52 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Kim Jong Un: కిమ్ కీలక నిర్ణయం... పర్యాటకులకు ఆహ్వానం

Date : 15 August 2024 11:51 AM Views : 38

Studio18 News - అంతర్జాతీయం / : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశాన్ని సందర్శించాలనుకునే విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పారు. ఈశాన్య నగరమైన సంజియోన్ కి డిసెంబర్ నెల నుండి అంతర్జాతీయ పర్యాటకాన్ని పునః ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలకూ పర్యాటకాన్ని అనుమతించవచ్చని ఆ దేశ టూరిస్ట్ కంపెనీలు బుధవారం వెల్లడించాయి. కఠినమైన కొవిడ్ నిబంధనల కారణంగా ఆ దేశం తన సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. 2020 నుండి అంతర్జాతీయ పర్యాటకులను ఉత్తర కొరియా నిషేధించింది. తాజాగా కొవిడ్ తగ్గడంతో తమ దేశానికి అంతర్జాతీయ పర్యాటకులను ఆహ్వానిస్తొంది. ఈ ప్రకటన కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న కొరియా టూర్స్ హర్షం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియాలోని సంజియోన్ నగరం చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో పర్యాటకుల కోసం అపార్ట్ మెంట్లు, స్కీ రిసార్ట్స్, హోటళ్లు ఏర్పాటు అయ్యాయి. మరో ట్రావెల్ ఏజన్సీ కేటీజీ టూర్స్ సైతం ఈ శీతాకాలం నుండి పర్యాటకులు సంజియోన్ కు వెళ్లవచ్చని ప్రకటించింది. సంజియోన్ కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు అధికారికంగా పర్యాటక కార్యకలాపాలు 2024 డిసెంబర్ లో తిరిగి ప్రారంభమవుతాయని తమ స్థానిక భాగస్వామి నుండి ధ్రువీకరణ పొందామని బీజింగ్ కు చెందిన కొరియో టూర్స్ తన వెబ్ సైట్ లో తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఉత్తర కొరియా గత ఏడాది అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించింది. ఆ క్రమంలో రష్యన్ పర్యాటకులు ఫిబ్రవరిలో ప్రైవేట్ పర్యటన కోసం ఉత్తర కొరియాను సందర్శించారు. జూన్ నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా విదేశీ ఉన్నతాధికారులు ఆ దేశాన్ని సందర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :