Thursday, 14 November 2024 06:35:04 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

Donald Trump: మా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తావా?.. మస్క్ కు ట్రంప్ జాబ్ ఆఫర్

Date : 13 August 2024 01:56 PM Views : 316

Studio18 News - అంతర్జాతీయం / : సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో అమెరికా మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలో భాగంగా ట్రంప్ కు మస్క్ పలు ప్రశ్నలు సంధించగా.. వాటికి జవాబిచ్చిన ట్రంప్ ఆ తర్వాత మస్క్ కు జాబ్ ఆఫర్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కలిసి పనిచేయాలని కోరారు. తమ ప్రభుత్వం చేసే వివిధ ఖర్చులను నియంత్రించే బాధ్యతను మస్క్ చేపట్టాలన్నారు. ఎక్స్ తో పాటు మస్క్ కంపెనీలలో కాస్ట్ కట్టింగ్ చాలా ప్రభావవంతంగా ఉందని, ఖర్చుల నియంత్రణలో మస్క్ గొప్ప నిపుణుడని ట్రంప్ కొనియాడారు. ఈ విషయం గుర్తించాను కాబట్టే మస్క్ కు జాబ్ ఆఫర్ చేశానని వివరించారు. టాక్స్ పేయర్ల నుంచి ప్రభుత్వానికి చేరే సొమ్మును జాగ్రత్తగా వినియోగించాలనేదే తన అభిమతమని, టాక్స్ పేయర్ల కష్టార్జితాన్ని వృథా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. మస్క్ కనుక ఈ బాధ్యతను స్వీకరిస్తే అమెరికాకు గొప్ప ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఆఫర్ కు మస్క్ జవాబివ్వనప్పటికీ వారిద్దరి మధ్య ఇప్పటికే దీనిపై చర్చ జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే ప్రభుత్వంలో మస్క్ ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై వారు చర్చించుకున్నట్లు తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :