Thursday, 05 December 2024 08:25:39 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Taiwan: తైవాన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న చైనా.. 41 యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు

Date : 23 August 2024 12:03 PM Views : 125

Studio18 News - అంతర్జాతీయం / : తాజా పరిణామాలు చూస్తుంటే తైవాన్ చుట్టూ చైనా మరింతగా ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది. తమ భూభాగానికి సమీపంలో 41 చైనా యుద్ధ విమానాలు, ఏడు నౌకలను గుర్తించినట్టు తైవాన్ రక్షణ మంత్రిత్వాశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇది మరింత పెంచింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (పీఎల్ఏఎన్) తమ దేశం చుట్టూ మోహరించి ఉన్నట్టు పేర్కొన్న తైవాన్ రక్షణశాఖ.. 32 విమానాలు సున్నితమైన మధ్యస్థ రేఖను దాటి తమ ఈస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి ప్రవేశించినట్టు పేర్కొంది. దీంతో అప్రమత్తమైన తైవాన్ సాయుధ దళాలు దీనిని నిశితంగా గమనిస్తున్నాయి. తమ గగన తలాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాయి. పీఎల్‌ఏకు చెందిన 8 విమానాలు, ఆరు నౌకలను తమ భూభాగ సమీపంలో తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ నిన్ననే గుర్తించింది. ఈ ఉదయం మరిన్ని విమానాలు, నౌకలు కనిపించడంతో అప్రమత్తమైంది. విమానాల్లో మూడు సున్నితమైన మధ్యస్థ రేఖను ఉల్లంఘించినట్టు తైవాన్ ఆరోపించింది. తైవాన్‌ను స్వతంత్ర దేశంగా అంగీకరించేందుకు ఇష్టపడని చైనా దానిపై కన్నేయడంతో తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. దీనికితోడు తైవాన్‌కు అమెరికా అండగా ఉండడం కూడా చైనాకు కంటగింపుగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ తైవాన్‌పై దండెత్తేందుకు ప్రయత్నిస్తూ ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :