Sunday, 08 March 2026 03:53:07 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Indian visa centres: బంగ్లాదేశ్‌లోని అన్ని భారత వీసా సెంటర్లు మూసివేత!

Date : 08 August 2024 03:59 PM Views : 286

Studio18 News - అంతర్జాతీయం / : పొరుగు దేశం బంగ్లాదేశ్ నిర‌స‌న‌కారుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతోంది. ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో రిజర్వేష‌న్ కోటాకు వ్య‌తిరేకంగా గ‌త నెల‌లో మొద‌లైన నిర‌స‌న‌లు ఇటీవ‌ల హింసాత్మ‌కంగా మారాయి. దాంతో ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, దేశం విడిచిపెట్టి వెళ్లిపోవ‌డం జ‌రిగిపోయాయి. అలా ఆమె దేశం విడిచిపెట్టినా.. ఇంకా అక్క‌డ ఆగ్ర‌హ‌జ్వాల‌లు ఆర‌డం లేదు. నిస‌ర‌న‌కారులు భారీ మొత్తంలో ప్ర‌భుత్వ, మైనారిటీల‌ ఆస్తుల‌ను ధ్వంసం చేస్తున్నారు. దాంతో రాజ‌ధాని ఢాకా ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అశాంతి, భారీ నిరసనల మధ్య బంగ్లాదేశ్‌లోని అన్ని భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలు నిరవధికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ అన్ని సెంటర్లూ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారమివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో మెసేజ్‌ పెట్టారు. కాగా, దేశంలో నెల‌కొన్న‌ అస్థిర పరిస్థితుల నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌లోని హైకమిషన్, కాన్సులేట్‌ల నుండి 190 మంది అనవసర సిబ్బంది, వారి కుటుంబ స‌భ్యులను ఇండియా ఖాళీ చేసిన మ‌రుస‌టి రోజు ఈ పరిణామం జరిగింది. అయితే, దౌత్యవేత్తలందరూ బంగ్లాదేశ్‌లోనే ఉన్నారు. అలాగే మిషన్లు పనిచేస్తాయి. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హై కమీషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాహి, ఖుల్నా, సిల్హెట్‌లలో కాన్సులేట్‌లను భార‌త్‌ కలిగి ఉన్న విష‌యం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :