Tuesday, 17 September 2024 12:34:55 AM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

viral Video : హెజ్‌బొల్లా ఉగ్రదాడులను ఇలా తిప్పికొట్టాం.. వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

Date : 26 August 2024 11:11 AM Views : 25

Studio18 News - అంతర్జాతీయం / : Israel Defense Forces : పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారు జామున దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా.. ప్రతిగా హెజ్‌బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. లెబనాన్ పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరానలు ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. ఉత్తర, మధ్య ఇజ్రాయెల్ లోని లక్ష్యాలపై హెజ్‌బొల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. తమపై దాడులు చేయడానికి హెజ్‌బొల్లా లెబనాన్ లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను, క్షిపణులను హెజ్‌బొల్లా ప్రయోగించనుందనే సమాచారం అందాకే వైమానిక దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. తమకు నష్టం కలగజేసే వారికి తప్పకుండా నష్టం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపాడు. తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఓ వీడియోను విడుదల చేసింది. హెజ్‌బొల్లా ఉగ్రదాడులను ఇలా తిప్పికొట్టామని పేర్కొంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఇలా పేర్కొంది.. హెజ్‌బొల్లా నుండి పెద్ద ఎత్తున తీవ్రవాద దాడిని ఆపడానికి ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) ఎలా పని చేసిందో చూడండి. లెబనాన్‌లో మా ఆపరేషన్ ఇజ్రాయెల్ కుటుంబాలను, ఇళ్లను రక్షించడానికి చేసిందేనని ఇజ్రాయెల్ పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :