Wednesday, 30 April 2025 04:56:30 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Canada Study Visa: భారతీయ విద్యార్థులకు కెన‌డా షాక్‌.. స‌గానికి త‌గ్గ‌నున్న స్ట‌డీ వీసాలు!

Date : 11 September 2024 12:59 PM Views : 79

Studio18 News - అంతర్జాతీయం / : కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు అక్క‌డి ప్ర‌భుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్ప‌టికే కొత్త వ‌ల‌స విధానం, విదేశీ విద్యార్థుల వార‌పు ప‌నిగంట‌ల‌ను జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం త‌గ్గించింది. దీంతో అక్క‌డ ఉన్న మ‌న వారిపై ఆర్థిక భారం పెరిగింది. ఇప్పుడు ఈ ఏడాది ఇండియ‌న్ స్టూడెంట్స్‌ స్టడీ పర్మిట్ ఆమోదాలు దాదాపు 50శాతం మేర‌ తగ్గుతాయని కెన‌డా ఎడ్యుకేష‌న్ టెక్నాల‌జీ కంపెనీ అప్లైబోర్డ్ నివేదిక తాజాగా అంచనా వేసింది. 2018, 2019లో వ‌చ్చిన‌ విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కెనడియన్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నివేదిక పేర్కొంది. దీంతో ఈ ఏడాది స్ట‌డీ ప‌ర్మిట్ల‌ ఆమోదాల క్షీణత ఏర్పడింద‌ని తెలిపింది. అప్లైబోర్డ్‌ నివేదిక నుండి వచ్చిన ఈ స‌మాచారాన్ని ది గ్లోబ్ అండ్ మెయిల్ మంగళవారం ప్రచురించింది. "ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్‌ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయి" అని నివేదిక పేర్కొంది. ఇది పూర్తి ఏడాది ఇలాగే కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో అంతర్జాతీయ విద్యార్థులను అనుసంధానించే సంస్థ అప్లైబోర్డ్‌ నివేదిక. 2023లో ఆమోదించబడిన విదేశీ విద్యార్థుల స్ట‌డీ వీసాల సంఖ్య 4,36,000గా ఉంది. కానీ, 2024లో ఇప్ప‌టివ‌ర‌కు కేవలం 2,31,000గా ఉందని నివేదిక తెలిపింది. దీని ప్ర‌కారం 2023తో పోలిస్తే 2024లో కెనడియన్ స్టడీ పర్మిట్‌ల కోసం గ్లోబల్ అప్లికేషన్‌లలో 39శాతం తగ్గుదల ఉంద‌ని నివేదిక అంచనా వేసింది. ఇక 2022లో కెనడాలోని 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులలో 2.26 లక్షల మంది ఇండియ‌న్ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ‌ ఆర్థిక వ్యవస్థకు సహకరించారు. అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థిక అవసరాలను పెంచేలా (ఇటీవ‌ల విద్యార్థుల ప‌ని గంట‌ల‌ను త‌గ్గించ‌డం) కెనడియన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు చాలా మంది భావి విద్యార్థులను నిరుత్సాహపరిచాయని అప్లైబోర్డు సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మేటి బసిరి తెలిపారు. " కెనడా ఒకప్పుడు అంతర్జాతీయ విద్యార్థులను స్వాగతించిన విధంగా ఇటీవ‌ల కాలంలో ఆ ప‌రిస్థితులు కనిపించడం లేదు" అని బసిరిని ఉటంకిస్తూ ది గ్లోబ్ అండ్ మెయిల్ పేర్కొంది. దాంతో చాలామంది విదేశీ విద్యార్థులు ఇప్పుడు కెన‌డాకు స్టడీ ప‌ర్మిట్ల కోసం దరఖాస్తు చేయ‌డం లేదు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఇతర గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :