Sunday, 07 December 2025 08:13:31 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ఇంధన ట్యాంకర్ ఢీకొని 48మంది మృతి

Date : 09 September 2024 10:31 AM Views : 230

Studio18 News - అంతర్జాతీయం / : Nigeria : నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఇంధన ట్యాంకర్ ఢీకొనగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 48 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. 50 మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. మంటల్లో చిక్కుకొని మృతదేహాలను గుర్తించలేని విధంగా కాలిపోయాయి. ఆదివారం సాయంత్రం ఉత్తర్ – మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర – మధ్య నైజర్ రాష్ట్రంలోని స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా -అరబ్ మాట్లాడుతూ.. ప్రయాణికులు, పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదంలో అనేక ఇతర వాహనాలు కూడా దగ్దమయ్యాయని అన్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలంకు చేరుకోవటం జరిగింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించగా.. తొలుత 30 మృతదేహాలను గుర్తించడం జరిగిందని, ఆ తరువాత మరో 18మంది మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోవటం జరిగిందని బాబా-అరబ్ తెలిపారు. ఘోర ప్రమాదంపై విచారం వ్యక్తంచేసిన నైజర్ రాష్ట్ర గవర్నర్ మహమ్మద్.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. నైజీరియాలో ట్రక్కు ప్రమాదాలు నిత్యం జరుగుతుంటాయి. సమర్ధవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవటంతో రోడ్డు మార్గంలో భారీగా సరుకు రవాణా జరుగుతుంది. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2020లోనే నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ 1,531 ట్యాంకర్ ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. ఈ ప్రమాదాల్లో 535 మంది మరణించారు. మరో వెయ్యికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :