Monday, 08 December 2025 03:48:33 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Sunitha Williams: అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకోనున్న సునీతా విలియమ్స్

Date : 14 September 2024 04:10 PM Views : 292

Studio18 News - అంతర్జాతీయం / : వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ లు బోయింగ్ స్టార్ లైనల్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని విల్మోర్ చెప్పారు. బ్యాలెట్ పేపర్ కోసం తమ అభ్యర్థనను కిందకు పంపించామని తెలిపారు. బాధ్యత గల అమెరికా పౌరులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తమ కర్తవ్యమని చెప్పారు. తమ విధిని నిర్వహించుకోవడానికి నాసా సహకరిస్తుందని అన్నారు. సునీత మాట్లాడుతూ... ఓటు వేయడం తమ బాధ్యత అని చెప్పారు. అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు. మరోవైపు అంతరిక్షం నుంచి వ్యోమగాములు ఓటు వేయడం ఇదే తొలిసారి కాదు. 1977 నుంచే వ్యోమగాములకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వ్యోమగాములు ఓటు వేయడానికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియ కొంత క్లిష్టమైనదే అయినప్పటికీ... నాసా దాన్ని కొనసాగిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :