Saturday, 24 January 2026 02:37:56 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Wetland Virul: మరో వైరస్‌ను గుర్తించిన చైనా.. మెదడుని దెబ్బతీసే లక్షణాలు గుర్తింపు

Date : 09 September 2024 04:06 PM Views : 335

Studio18 News - అంతర్జాతీయం / : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా పట్టి పీడించిందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ సృష్టించిన లాక్‌డౌన్‌లు, ఐసోలేషన్లు అన్నీ ముగిసిపోయి ఇప్పుడిప్పుడే ప్రపంచం మునుపటి సాధారణ స్థితికి చేరుకున్న దశలో.. చైనాలో మరో కొత్త వైరస్‌ను గుర్తించారు. వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అనే హానికర వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడు వ్యాధులకు కూడా దారితీస్తోన్న ఈ వైరస్‌ను 2019 జూన్‌లో మొదటిసారి చైనాలోని జిన్‌జౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. వైరస్‌కు గురైనట్టు గుర్తించిన తొలి వ్యక్తి వెస్ట్‌ల్యాండ్ అనే పార్క్‌కు వెళ్లాడు. అక్కడే అతడికి వైరస్ సోకింది. అందుకే దీనికి ‘వెట్‌ల్యాండ్ వైరస్’ అని పేరు పెట్టారని ‘ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ పేర్కొంది. 2019లో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో ఉన్న వెస్ట్‌బ్యాంక్ అనే పార్క్‌లో ఓ పేను కాటుకు గురైన వ్యక్తి నిరంతర జ్వరం, పలు శరీర అవయవాలు పనిచేయని లక్షణాలతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడని జర్నల్ పేర్కొంది. అయితే వైరస్ సీక్వెన్స్‌ను పరిశీలించి ‘వెట్‌ల్యాండ్’ వైరస్ అని పేరు పెట్టారని పరిశోధకులు పేర్కొన్నారు. గతంలో ఈ వైరస్‌ను గుర్తుతెలియని ఆర్థోనైరోవైరస్‌‌గా పేర్కొనే వారని చెప్పారు. 17 మంది రోగులలో వెట్‌ల్యాండ్ వైరస్ గుర్తింపు.. వెట్‌ల్యాండ్ వైరస్ లక్షణాలు మొత్తం 17 మందిలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదటి వ్యక్తికి వైరస్ సోకడానికి కారణమైన అదే పార్కును సందర్శించిన వ్యక్తుల్లో ఈ వైరస్‌ను వైద్యులు నిర్దారించారు. అదే లక్షణాలతో చేరిన వారిలో ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో పెద్ద సంఖ్యలో నమూనాలను స్వీకరించడం మొదలుపెట్టారు. చైనాలోని ఇన్నర్ మంగోలియా, హీలాంగ్జియాంగ్, జిలిన్, లియోనింగ్‌లలో ఈ రోగులను గుర్తించారు. వీరంతా తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు గుర్తించినట్టు అధ్యయనం పేర్కొంది. వైరస్ లక్షణాలు ఇవే.. వెట్‌ల్యాండ్ వైరస్‌కు గురైన అందరిలోనూ ఒకే విధమైన లక్షణాలు కనిపించడం లేదు. అయితే అందరిలోనూ జ్వరం, తలనొప్పి, మైకం, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. కొందరికి చర్మంపై చిన్నగా, గుండ్రని ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు ఉంటున్నాయి. లెంఫాడెనోపతీ అనే లక్షణం కూడా కొందరిలో కనిపిస్తోంది. శరీరంలోని ఒక ప్రాంతంలో కణుపులు వాస్తున్నాయి. మెడ లేదా చంక వంటి భాగాల్లో వాపు కనిపిస్తోంది. అంతేకాదు వెట్‌ల్యాండ్ వైరస్ మెదడుపై కూడా ప్రభావం చూపుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :