Thursday, 05 December 2024 09:57:30 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Gaza: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం... శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు పడుతుందట!

Date : 12 September 2024 03:10 PM Views : 29

Studio18 News - అంతర్జాతీయం / : 2024 అక్టోబ‌ర్‌లో ఇజ్రాయెల్‌‌పై హ‌మాస్ జ‌రిపిన మెరుపు దాడికి ప్ర‌తీకారంగా గాజా న‌గ‌రాల‌పై ఇజ్రాయెల్ బ‌ల‌గాలు విరుచుకుప‌డ్డాయి. దీంతో గాజా న‌గ‌రాలు చాలా వ‌ర‌కు ధ్వంస‌మ‌య్యాయి. భారీ ఎత్తున ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగింది. ఈ విధ్వంసంలో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 80వేల ఇళ్లు ధ్వంసం కాగా, వీటిని పున‌ర్నిర్మించాలంటే బిలియ‌న్ డాల‌ర్లు వెచ్చించాల్సి ఉంటుంద‌ని తాజాగా ఐక్య‌రాజ్య స‌మితి (యూఎన్ఓ) అంచ‌నా వేసింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 4 కోట్ల ట‌న్నుల శిథిలాలు పేరుకుపోయిన‌ట్లు యూఎన్ఓ పేర్కొంది. వీటిని తొల‌గించేందుకు ఏకంగా 15 ఏళ్లు ప‌డుతుంద‌ని అంచ‌నా వేసింది. అలాగే 50 నుంచి 60 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయాల‌ని తెలిపింది. యూఎన్ఓ రిపోర్ట్ ప్ర‌కారం గాజా పున‌ర్నిర్మాణానికి 2040 వ‌ర‌కు లేదా మ‌రిన్ని ద‌శాబ్దాల స‌మ‌యం పడుతుంద‌ని అంచనా వేసింది. ఈ యుద్ధంలో గాజాలో 80వేల ఇళ్లు ధ్వంసమైన‌ట్లు గాజా అధికారులు తెలిపారు. 18.5 బిలియ‌న్ డాల‌ర్ల (రూ. 1.53ల‌క్ష‌ల కోట్ల‌) మేర ఆస్తి న‌ష్టం జ‌రిగింది. అలాగే 41వేల‌కు పైగా పాల‌స్తీనియ‌న్లు చనిపోయారు. 95వేల మంది గాయ‌ప‌డ్డారు. శిథిలాల కింద మ‌రో 10వేల మృత‌దేహాలు ఉండొచ్చ‌ని అంచ‌నా. ఇక అక్టోబ‌ర్‌లో ఇజ్రాయెల్‌పై హ‌మాస్ జ‌రిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :