Thursday, 05 December 2024 09:44:58 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Turkey: తుర్కియే పార్ల‌మెంట్‌లో డిష్యుం .. డిష్యుం..

Date : 17 August 2024 12:03 PM Views : 37

Studio18 News - అంతర్జాతీయం / : ఎంపీలు బాహాబాహీకి దిగ‌డంతో తుర్కియే పార్ల‌మెంట్ శుక్ర‌వారం ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించింది. అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దుల వ‌ర్షం కురిపించుకున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ మ‌హిళా ఎంపీతో పాటు ప్ర‌తిప‌క్ష నేత ఒక‌రు కూడా గాయ‌ప‌డ్డారు. అస‌లేం జ‌రిగిందంటే.. 2013లో తుర్కియే ప్ర‌ధానిగా ఉన్న ఎరోగ‌న్ పాల‌న‌ను వ‌ర్క‌ర్స్ పార్టీ ఆఫ్ తుర్కియే అధినేత క్యాన్ అట‌లే అనేక‌సార్లు స‌వాలు చేశారు. దీంతో 2013లో ఎరోగ‌న్ పాల‌నకు వ్య‌తిరేకంగా ప‌లుమార్లు నిర‌స‌న‌లు జ‌రిగాయి. దాంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక నిర‌స‌న‌ల‌కు కార‌ణం క్యాన్ అట‌లే అని పేర్కొంటూ తుర్కియే కోర్టు 2022లో ఆయ‌న‌కు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్ర‌స్తుతం ఆయ‌న జైలుశిక్ష అనుభ‌విస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో క్యాన్ అట‌లే పార్ల‌మెంట్ డిప్యూటీగా ఎన్నిక‌య్యారు. దాంతో పార్ల‌మెంటుకు హాజ‌ర‌య్యేందుకు త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని, త‌న ప‌ద‌వీకాలం ముగిసిన వెంట‌నే మ‌ళ్లీ జైలుశిక్ష అనుభ‌విస్తాన‌ని ఇటీవ‌ల ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో కోర్టు అట‌లేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై శుక్ర‌వారం పార్ల‌మెంట్‌లో చ‌ర్చ జ‌రిగింది. మాట‌మాట పెర‌గ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎంపీలు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్ద‌రు ఎంపీలకు గాయాల‌య్యాయి. కాగా, ఎంపీలు ర‌క్తం వచ్చేలా కొట్టుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ర్ష‌ణ‌పై ప్ర‌తిప‌క్ష పార్టీ నేత ఓజ్‌గుర్ ఓజెల్ మాట్లాడుతూ, ఎంపీలు కొట్టుకోవ‌డం సిగ్గుచేటు అని అన్నారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌జాప్ర‌తినిధులు ఇలా దాడులు చేసుకోవ‌డం ఏంట‌ని, నేల‌పై ర‌క్తం పారుతోంద‌ని వాపోయారు. క‌నీసం మ‌హిళా ఎంపీల‌ను క‌నిక‌రం లేకుండా కొడుతున్నారంటూ విమ‌ర్శించారు. ఇక తుర్కియే చ‌ట్ట‌స‌భ‌లో స‌భ్యులు ఇలా భౌతిక దాడి చేసుకోవ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ప‌లు సంద‌ర్భాల్లో ఎంపీలు బాహాబాహీకి దిగి కొట్టుకున్న‌ ఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :