Sunday, 25 January 2026 05:08:34 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

USA: అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి!

Date : 31 August 2024 02:53 PM Views : 382

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థినిని భారత‌ సంతతి వ్యక్తి కిరాత‌కంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. హ్యూస్టన్‌లో ఆమె అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి య‌త్నించిన‌ సమయంలో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కమ్యూనిటీ కళాశాల విద్యార్థిని అయిన‌ మున పాండే సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తన హ్యూస్టన్ అపార్ట్‌మెంట్‌లో తుపాకీ గాయాలతో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సిబ్బంది పోలీసులకు కాల్ చేసి ఈ సంఘ‌ట‌న గురించి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చిన పోలీసులు పాండేను ర‌క్త‌పుమ‌డుగులో నిర్జీవంగా ప‌డిఉండ‌టాన్ని గుర్తించారు. అనంత‌రం రంగంలోకి దిగిన పోలీసులు హ‌త్య జ‌రిగిన‌ రెండు రోజుల తర్వాత సీసీటీవీ ద్వారా ఆమె ఇంటికి వ‌చ్చిన‌ బాబీ సిన్ షా ఫొటోను గుర్తించారు. ఆ మ‌రుస‌టి రోజే షాను అరెస్టు చేసి హత్యా నేరం మోపినట్లు పోలీసులు తెలిపారు. 'గోఫండ్‌మీ' పేజీ ప్రకారం మున‌ పాండే 2021లో నేపాల్ నుండి హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌లో పాండే మృతదేహాన్ని గుర్తించ‌డానికి ముందు ఆమె తల్లి ఆమెతో మాట్లాడ‌టానికి రోజుల త‌ర‌బ‌డి చాలాసార్లు ప్రయత్నించిందని నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ సభ్యుడు ఒక‌రు న్యూయార్క్ పోస్టుతో చెప్పారు. పాండే తల్లి హూస్టన్‌కు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్ల కోసం సహాయం చేసేందుకు నేపాల్ కాన్సులేట్‌తో కలిసి అసోసియేష‌న్ పని చేస్తోంది. ఇక పాండే అంత్య‌క్రియ‌తో పాటు ఆమె తల్లిని హ్యూస్టన్‌కు తీసుకురావడానికి గోఫండ్‌మీ పేజీ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ దాదాపు 30వేల డాల‌ర్ల వ‌ర‌కు పోగు చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :