Monday, 17 March 2025 04:16:18 PM
# Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు # DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ # Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి # L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్ # KA Paul: రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం అనిపించుకోవడం ఒక అన్నగా బాధ కలిగించింది: కేఏ పాల్ # Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి # Narendra Modi: మేం శాంతిని కోరుకుంటుంటే... పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ # AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం # AR Rahman: నేనింకా రెహమాన్ భార్యనే... ఆడియో సందేశం వెలువరించిన సైరా బాను

నా క్లాస్ లో 99 శాతం మంది ఇండియన్లే.. ఇదేమన్నా స్కామా?.. అమెరికన్ స్టూడెంట్ ప్రశ్న

ఇంతమంది అమెరికాలో చదివేందుకు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్న ఓ లోకల్ యూనివర్సిటీలో దాదాపుగా విద్యార్థులంతా విదేశీయులేనని వెల్లడి సోషల్ మీడియా

Date : 16 November 2024 01:31 PM Views : 84

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థులపై అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇంతమంది ఇండియన్లు అమెరికాకు ఎందుకు వస్తున్నారని, డిగ్రీ కోసం కాకుండా అమెరికాలో ఉద్యోగం, వీసాల కోసం ప్రయత్నిస్తున్నారని యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. అమెరికాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో ఓ యువతి చేసిన పోస్టు ప్రస్తుతం చర్చకు దారితీసింది. అమెరికాలో పుట్టిపెరిగిన 26 ఏళ్ల యువతినంటూ చెప్పుకున్న సదరు యూజర్.. తాను కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ కోసం ఓ సాధారణ యూనివర్సిటీ కాలేజీలో చేరానన్నారు. తొలిరోజు క్లాసుకు వెళ్లినపుడు అక్కడున్న వారిని చూసి ఆశ్చర్యపోయానని వివరించారు. తన క్లాసులో 99 శాతం మంది విదేశీయులేనని, అందులోనూ ఇండియన్లేనని పేర్కొంది. ఆ యూనివర్సిటీ పెద్దగా పేరున్నదేమీ కాదని చెబుతూ.. ఇలాంటి కాలేజీలో ఇంతమంది విదేశీయులు చేరారంటే ఇదేమన్నా స్కామ్ అయి ఉంటుందా అని సందేహం వ్యక్తం చేసింది. ఇంతమంది ఇండియన్లు నిజంగా అమెరికాకు మాస్టర్స్ డిగ్రీ కోసమే వచ్చారా.. ఇక్కడ ఉద్యోగం సంపాదించుకుని, వీసా పొందాలని వచ్చే వారు చాలామంది నెలల తరబడి ఉద్యోగాల కోసం వెతుకుతున్నా దొరకడంలేదని చెప్పింది. ఎన్నో ఆశలతో వస్తున్న వారిలో చాలామంది యువతీయువకులు చివరకు బాధితులుగా మిగిలిపోతున్నారని సానుభూతి వ్యక్తం చేసింది. వారి పరిస్థితి చూస్తే, భవిష్యత్తుపై వారి ఆశలు వింటుంటే తనకు వారిపై జాలి కలుగుతోందని చెప్పింది. అదే సమయంలో క్లాస్ రూంలో వారి ప్రవర్తన సరిగా లేదని విమర్శించింది. ఓవైపు ప్రొఫెసర్ క్లాసు తీసుకుంటున్నా పలువురు విద్యార్థులు గట్టిగా మాట్లాడుతున్నారని, క్లాస్ రూంలో ఎలా ప్రవర్తించాలో వారికి తెలియదని ఎద్దేవా చేసింది. ఈ పోస్టుకు బదులిస్తూ.. అంతకుముందుతో పోలిస్తే ఇటీవలి కాలంలో అమెరికా వర్సిటీలలో చేరే భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఓ యూజర్ చెప్పారు. ఎడ్యుకేషన్ లోన్లు సులభంగా లభించడంతో పాటు యూనివర్సిటీల దరఖాస్తు విధానాలను సరళీకృతం చేయడమూ ఓ కారణమేనని వివరించారు. కాగా, అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022-23 విద్యాసంవత్సరంలో అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చేరిన ఇండియన్ స్టూడెంట్ల సంఖ్య 2,68,923.. ఏటేటా దాదాపు ఇంతే మొత్తంలో భారత విద్యార్థులు అమెరికా వర్సిటీలలో చేరుతున్నారు.

Also Read : 16 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన హీరో .. అయినా దక్కని ఫలితం!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :