Saturday, 24 January 2026 09:02:11 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Helene: అమెరికాలో హరికేన్ విధ్వంసం.. 4 రాష్ట్రాల్లో 45 మంది మృతి

Date : 28 September 2024 11:59 AM Views : 359

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికాలో హరికేన్ హెలెనా విధ్వంసం సృష్టిస్తోంది.. పెనుగాలులకు ఫ్లోరిడా రాష్ట్రం చిగురుటాకుల వణికింది. ఎటుచూసినా విరిగిపడిన చెట్లు, కుప్పకూలిన ఇళ్లు, వరద నీటితో పరిస్థితి భయానకంగా ఉందని బాధితులు వాపోతున్నారు. కుండపోత వర్షాలకు నాలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఇళ్లు, ఆఫీసులు, ఆసుపత్రులు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా లేక చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. ఫ్లోరిడాతో పాటు జార్జియా, నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో హెలెనా ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. వర్జీనియా రాష్ట్రంలోనూ హెలెనా బీభత్సం సృష్టిస్తోంది. జార్జియాలోని ఓ ఆసుపత్రి నీట మునగడంతో పేషెంట్లు, సిబ్బంది బంగ్లా పైకెక్కి సాయం కోసం కేకలు పెట్టారు. బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు హెలికాఫ్టర్ సాయంతో మొత్తం 54 మందిని కాపాడారు. నాలుగు రాష్ట్రాల్లో హెలెనా సృష్టించిన విధ్వంసానికి ఇప్పటి వరకు 45 మంది చనిపోయారు. రెస్క్యూ పనుల్లో నిమగ్నమైన ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది ముగ్గురు కూడా చనిపోయారు. టెనెస్సీ లో 7 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్లోరిడాలో హరికేన్ తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచాయి. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో తీర ప్రాంతంలోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఇళ్లు ఉన్నచోట ప్రస్తుతం శిథిలాల కుప్పలు కనిపిస్తున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు హెలెనా హరికేన్ ను కేటగిరి 4 గా ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో సుమారు 25 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. అట్లాంటాలో 1886 లో 24.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. హెలెనా ప్రభావంతో 48 గంటల్లో 28.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. నార్త్ కరోలినాలో వరదల్లో చిక్కుకున్న వంద మందిని రెస్క్యూ టీమ్ లు కాపాడాయి. వరదల్లో ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలతో పాటు ఇంట్లోని వస్తువులు కూడా కొట్టుకుపోయాయి. పలుచోట్ల గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోతుండడం చూశామని వరద బాధితులు చెప్పారు. తలహస్సీలోని ఓ స్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 175 మంది ఆశ్రయం పొందుతున్నారు. హరికేన్ కారణంగా స్కూళ్లు, ఆఫీసులు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. కాగా, హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడంతో పాటు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వివరించారు. హెలెనా హరికేన్ ను అంతరిక్ష కేంద్రం నుంచి చిత్రించిన వీడియోను నాసా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :