Saturday, 17 January 2026 08:58:39 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Naim Kassem: నస్రల్లాను మించిన నయీమ్ ఖాసిమ్... ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు

Date : 09 October 2024 12:11 PM Views : 253

Studio18 News - అంతర్జాతీయం / : ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లు హతమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ హిజ్బూల్లా తమ శక్తి సామర్థ్యాలపై ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా ఆ సంస్థ డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న నయీమ్ ఖాసిమ్ ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని, వారంతా నిరాశ్రయులు కావడం తప్పదని హెచ్చరించాడు. అగ్రనేతల మృతితో హిజ్బుల్లా నాయకత్వలేమిని ఎదుర్కొంటోందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ తరపున ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖాసిమ్ ఎవరనే చర్చ జరుగుతోంది. మిలిటెంట్ గ్రూపుల్లో ఒకటైన షియా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో హసన్ నస్రల్లా మాదిరిగానే నయీమ్ ఖాసిమ్ ఒకరు. అయితే, నస్రల్లా అంతటి చరిష్మా, వాగ్దాటి ఆయనకు లేవు. తెలుపు రంగు తలపాగా చుట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తుంటాడు. ఇంతకు ముందు నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిన సందర్భంలోనూ సభలు, ఇంటర్వ్యూలతో పాటు ఇతర బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నస్రల్లా కంటే ఖాసిమ్ తీవ్ర భావజాలం కలిగిన వ్యక్తి అని, ఆయన బహిరంగ ప్రకటనలు చూస్తే అర్థమవుతుందని ఆ సంస్థ కార్యకలాపాలపై పరిశోధనలు చేసే కార్నెగీ మిడిల్ ఈస్ట్ సెంటర్ ప్రతినిధి మొహనద్ అలీ చెప్పుకొచ్చారు. నస్రల్లా మృతి తర్వాత ఆయన దగ్గరి బంధువు హషేమ్ సఫీద్దీన్‌ ఆ బాధ్యతలు చేపడతారని భావించారు. కానీ, నస్రల్లా మరణం తర్వాత ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఖాసిమ్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మరో పక్క హిజ్బూల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్న అమెరికా ఖాసిమ్ పైనా ఆంక్షలు విధించింది. ఖాసిమ్ దక్షిణ లెబనాన్ లోని కఫర్ ఫిలాలో జన్మించాడు. స్థానిక యూనివర్సిటీలో చదువు పూర్తి చేసిన అనంతరం రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మతపరమైన విద్యను అభ్యసించిన ఖాసిమ్ .. విద్యార్ధులకూ బోధించే వాడు. ఇందుకోసం ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. 1970లో షియా వర్గానికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో మిలిటెంట్ సంస్థ తరపున చేరాడు. 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ సమయంలో ఏర్పడిన హిజ్బూల్లాలో చేరాడు. 1991 నుంచి ఆ సంస్థకు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :