Saturday, 07 March 2026 08:23:46 PM
# పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు

డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో చుక్కెదురు

హష్ మనీ కేసును కొట్టేయలేమన్న జడ్జి ఇప్పటికే దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు శిక్షను నిరవధికంగా వాయిదా వేసిన వైనం

Date : 17 December 2024 11:55 AM Views : 339

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా తేల్చగా.. ఈ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. అధ్యక్షులకు కేవలం అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లోనే రక్షణ ఉంటుంది తప్ప ఇలాంటి కేసుల్లో కాదని స్పష్టం చేసింది. హష్ మనీ కేసును కొట్టేయలేమని జడ్జి జువాన్‌ మర్చన్‌ తేల్చిచెప్పారు. హష్ మనీ కేసులో ట్రంప్ పై విచారణ జరిపిన మన్ హట్టన్ కోర్టు నవంబర్ లో ఆయనను దోషిగా తేల్చింది. పోర్న్ స్టార్ కు డబ్బులు ఇచ్చిన విషయం నిజమేనని నిర్ధారించింది. అయితే, ఈ లోగా ఎన్నికలు జరగడం, ట్రంప్ గెలవడంతో కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ కు శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ క్రమంలోనే క్రిమినల్‌ విచారణ ఎదుర్కోకుండా అధ్యక్షుడికి రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు తాజాగా ఆయనకు రక్షణ కల్పించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టు ఈ కేసును కొట్టివేయకుంటే శిక్ష అభియోగాలు ఎదుర్కొంటూ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. హష్‌ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ గతంలో స్టార్మీ డానియల్స్ అనే పోర్న్ స్టార్ తో సన్నిహితంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో స్టార్మీ డానియల్స్ నోరు విప్పకుండా ఉండేందుకు 1.30 లక్షల డాలర్లను ట్రంప్ ముట్టుజెప్పారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనినే హష్ మనీ అంటున్నారు. ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన విరాళాల సొమ్మును ఇలా దుర్వినియోగం చేశారని, దీనికోసం తప్పుడు రికార్డులు సృష్టించారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు మొత్తం 34 అంశాల్లో ట్రంప్ పై నేరారోపణలు నమోదయ్యాయి.

Also Read : నాగచైతన్య నా కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవాడు: శోభిత

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :