Friday, 13 June 2025 03:17:20 AM
# ట్రైనీ డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లిన విమానం... ఘటన స్థలంలో అందినకాడికి దోపిడీలు! # కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ # ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభ‌మైంది: మంత్రి లోకేశ్‌ # కూలిన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు... బతికే అవకాశాలు స్వల్పం! # జర్నలిస్టు కృష్ణంరాజుకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు # కూలిపోయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ...? # అహ్మదాబాద్ విమాన దుర్ఘటన... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడిన ప్రధాని మోదీ # ఘోర విమాన ప్రమాదం... గుజరాత్ సీఎంకు అమిత్ షా ఫోన్ # అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి # రోడ్డు పక్కన ఓ బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోయిన రఘురామ... కూల్చివేతకు ఆదేశాలు! # పంజాబ్ నుంచి యూకేకి బుల్లెట్ బండి, ఫర్నిచర్.. రూ.4.5 లక్షలు ఖర్చుపెట్టిన ఫ్యామిలీ! # రైల్వేశాఖ కొత్త నిబంధన.. తత్కాల్ బుకింగ్‌కు ఇక ఆధార్ తప్పనిసరి # 'తల్లికి వందనం' నిధులు నేడే విడుదల.. 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి # బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై దాడి # ఏఎంఏ అధ్యక్షుడిగా మన తెలుగు వైద్యుడు.. అమెరికా వైద్య చరిత్రలో నూతన అధ్యాయం! # ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి # కేజీబీవీ టాయిలెట్‌లో భారీ కొండచిలువ కలకలం # తెలిసి ఏ తప్పు చేయలేదు: సెల్ఫీ వీడియో విడుదల చేసిన ప్రముఖ జానపద గాయని మంగ్లీ # విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు # యోగాంధ్రకు సర్వం సిద్ధం.. గిన్నిస్ రికార్డు కోసం భారీ సన్నాహాలు

Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా?

Date : 08 October 2024 12:02 PM Views : 120

Studio18 News - అంతర్జాతీయం / : ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ హతమవలేదా? అతడింకా బతికే ఉన్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ అధినేత అయిన యహ్యా సిన్వర్ సజీవంగానే ఉన్నాడని ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అంతేకాదు, ఆయన తనకు రక్షణ కవచంగా ఇజ్రాయెల్ బందీలను ఉంచుకున్నట్టు ఖతర్ అధికారులు గతంలో పేర్కొన్నారని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. దీనిని బట్టి ఖతర్‌తో సిన్వర్ రహస్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్టు తెలుస్తోందని మీడియా పేర్కొంది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి అయిన సిన్వర్ ఈ ఏడాది ఆగస్టులో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెల 21న హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో సిన్వర్ మృతి చెంది ఉంటాడని భావించారు. అయితే, ఈ విషయంలో హమాస్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఇప్పుడు ఖతర్ దౌత్యవేత్త చేసిన పోస్టుతో అతడు బతికే ఉన్నాడని ఇజ్రాయెల్ భావిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :