Monday, 23 June 2025 03:15:15 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

Nasrallah Death: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా మృతదేహం స్వాధీనం.. శరీరంపై ఒక్క గాయం లేదు..! ఎలా మరణించాడంటే?

Date : 30 September 2024 11:47 AM Views : 92

Studio18 News - అంతర్జాతీయం / : Hezbollah Chief Nasrallah: లెబనాన్ రాజధాని బీరూట్ లోని దాహియా ప్రాంతంలోఉన్న హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతిచెందిన విషయం తెలిసిందే. భద్రతా సిబ్బంది దాడి జరిగిన ప్రదేశంలోనే నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో.. అసలు నస్రల్లా మృతికి ఇజ్రాయెల్ దాడులే కారణమా.. అంతకు ముందే మరణించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, భారీ బాంబు పేలుళ్ల కారణంగా షాక్ కు గురై నస్రల్లా చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. వార్తా సంస్థ రాయిటర్స్ కు లెబనీస్ భద్రత, వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. హసన్ నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. అతని శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని చెప్పారు. బాంబు పేలుళ్ల సమయంలో భారీ శబ్దం వచ్చిన సమయంలో అతను షాక్ కు గురై మరణించి ఉంటాడని వారు పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. హెజ్‌బొల్లా చీఫ్ మరణం తరువాత ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్-సుడానీ దేశంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. నస్రల్లా మరణం తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ దూకుడుతో హెజ్‌బొల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోన్న తరుణంలో ఈ పోరులో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ తో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ లోకి తన బలగాలను పంపేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ఉన్నత స్థాయి అధికారిని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దానికి సంబంధించిన అనుమతులు జారీ చేయనున్నట్లు పేర్కొంది. 1981 మాదిరిగానే ఇజ్రాయెల్ తో పోరాడేందుకు లెబనాన్ కు బలగాలను పంపుతామని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ నస్రల్లా దాక్కున్న హెజ్‌బొల్లా భూగర్భ కార్యాయలం యూఎన్ పాఠశాలకు కేవలం 53 మీటర్ల దూరంలోనే ఉందట. లెబనాన్ లోని బీరూట్ లో ఉన్న ఈ స్థలం నివాస ప్రాంతంలో ఉంది. ఇక్కడ సామాన్య ప్రజలు నివసిస్తున్నారు. అయితే, నస్రల్లా, ఆయనతోపాటు అనేక మంది కమాండర్లు భూగర్భంలోని భవనాల్లో దాక్కున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :