Studio18 News - అంతర్జాతీయం / : Hezbollah Secret Bunker : హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ను ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రతీకార దాడులకు దిగుతామని లెబనాన్ లోని హెజ్‌బొల్లా ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హెజ్‌బొల్లా మూలాలను టార్గెట్ చేస్తూ.. వారి రహస్య సొరంగాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఓ ఆసుపత్రి భవనం కింద ఉన్న రహస్య సొరంగంను గుర్తించామని.. అందులో భారీగా నగదు, బంగారం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ పేర్కొన్నారు. బీరుట్ నగరం నడిబొడ్డున అల్ -సాహెల్ ఆసుపత్రి భవనం కింద హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూపునకు చెందిన రహస్య బంకర్ ఉందని తెలిపారు. దానిపై మేము ఇంకా దాడి చేయలేదని, అయితే, ఆ రహస్య సొరంగంలో భారీగా నగదు, బంగారం ఉన్నట్లు తెలిసిందని డేనియల్ హగారీ చెప్పాడు. తమకున్న సమాచారం ప్రకారం.. 500 బిలియన్ డాలర్ల నగదు, భారీ ఎత్తున బంగారం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్ వీడియోను విడుదల చేశారు. ఇజ్రాయెల్ పై దాడికి ఈ నగదును హెజ్బొల్లా వినియోగిస్తున్నట్లు హగారీ వెల్లడించారు. లెబనాన్ వ్యాప్తంగా ఉన్న హెజ్ బొల్లా ఆర్థిక వనరులపై ఇజ్రాయెల్ సైన్యం దాడులకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే ఐడీఎఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News