Saturday, 07 March 2026 08:08:44 PM
# అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ట్రంప్ గెలవడంతో ఎక్స్ కు గుడ్ బై చెబుతున్న లక్షలాదిమంది యూజర్లు

మరో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘బ్లూస్కై’లో చేరుతున్న వైనం విషపూరితమైన వేదిక అంటూ ‘ఎక్స్’ పై విమర్శలు ట్రంప్ విజయం కోసం ఎక్స్ అధినేత ఎలాన్ మస్

Date : 16 November 2024 01:49 PM Views : 391

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం చాలా వాటిపై పడుతోంది. ట్రంప్ గెలవడం జీర్ణించుకోలేని మహిళలు చాలామంది తమ ప్రియుడు, భర్తలపై మండిపడుతున్నారు. కొంతమంది అమెరికన్లు దేశం విడిచిపెట్టి వెళుతుండగా.. మరికొందరు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ పైనా ట్రంప్ ఎఫెక్ట్ పడింది. డొనాల్డ్ ట్రంప్ కు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలకడం, ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేయడంతో పాటు ‘ఎక్స్’ లోనూ ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మండిపడుతున్న యూజర్లు ‘ఎక్స్’ కు గుడ్ బై చెబుతున్నారు. ఇదొక విషపూరితమైన ప్లాట్ ఫాం అంటూ ‘ఎక్స్’ ను వీడుతున్నారు. రోజూ లక్షలాది మంది తమ ఖాతాలను తొలగించుకుంటున్నారని సమాచారం. వీరంతా ‘బ్లూస్కై’ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ దాని పేరును ‘ఎక్స్’ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ పూర్తికాక ముందు ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సే వ్యవహరించారు. ట్విట్టర్ ను టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లడంలో డోర్సే కృషి ఎంతో ఉంది. అయితే, ట్విట్టర్ పగ్గాలు తన చేతికి వచ్చాక డోర్సేను మస్క్ తొలగించాడు. దీంతో 2019లో జాక్ డోర్సే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ‘బ్లూస్కై’ ని తీసుకొచ్చారు. దాదాపు ఐదేళ్లు ‘బ్లూస్కై’ ని డెవలప్ చేసిన డోర్సే ఇటీవలే అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ‘బ్లూస్కై’ కి జే గ్రాబర్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

Also Read : వేలేరుపాడు పీఎస్ లో బోరుగడ్డ అనిల్ ను విచారిస్తున్న పోలీసులు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :