Saturday, 17 January 2026 09:38:05 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

నమ్ముకున్న పాకిస్థాన్ ను ముంచేసిన చైనా... పేలకుండా తుస్సుమన్న చైనా మిస్సైల్

Date : 09 May 2025 03:11 PM Views : 275

Studio18 News - అంతర్జాతీయం / : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది. భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు నిష్ఫలమవ్వడమే కాకుండా, కొన్ని పేలకుండానే కిందపడిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ పరిణామాలతో చైనా ఆయుధాల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పాకిస్థాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండటాన్ని భారత బలగాలు గుర్తించాయి. మరోవైపు, లాహోర్‌లోని పాకిస్థాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ (AD) వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకొస్తున్నా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. చైనా నుంచి పాకిస్థాన్ అధిక ధరకు కొనుగోలు చేసిన ఈ ఆయుధాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో పాటు, వాటిని వినియోగించే నైపుణ్యం, శిక్షణ పాకిస్థాన్ దళాలకు కొరవడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద మోహరించిన చైనా HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా భారత్‌పై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించగా, భారత S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకొని నాశనం చేసింది. అంతేకాదు, జేఎఫ్-17 ఫైటర్ జెట్లను చైనా ఎంతో సమర్థవంతమైనవని చైనా చెప్పుకుంటుండగా... భారత్ పై ఆ యుద్ధ విమానాలను ఉపయోగించి పాక్ భంగపాటుకు గురైంది. నిన్న రాత్రి రెండు జేఎఫ్-17 ఫైటర్లను భారత్ కూల్చివేసింది. అవి గాల్లోకి లేచీ లేవడంతోనే భారత గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని గుర్తించి ఇంటర్ సెప్టర్ లను పంపించి పేల్చివేశాయి. ఈ ఘటనలు చైనా సైనిక పరికరాల విశ్వసనీయతపై చర్చకు దారితీయగా, పాక్ సైనికుల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ వైఫల్యాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు చైనాను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :