Sunday, 08 March 2026 04:13:55 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Quetta Blast: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో భారీ పేలుడు... 13 మంది మృతి!

Date : 30 September 2025 07:28 PM Views : 268

Studio18 News - అంతర్జాతీయం / : పారామిలిటరీ దళాలపై బాంబు దాడి 13 మంది మృతి, 32 మందికి పైగా గాయాలు దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో భారీ పేలుడు సంభవించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పారామిలిటరీ దళాలపై జరిగిన ఈ బాంబు దాడిలో కనీసం 13 మంది మృతి చెందగా, 32 మందికి పైగా గాయపడ్డారు. క్వెట్టాలోని ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే కాల్పుల మోత కూడా వినిపించింది. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. బలూచిస్థాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ మహమ్మద్ కాకర్ ఈ దాడిని ధృవీకరించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అయితే, బలూచ్ తిరుగుబాటు గ్రూపులు తరుచూ భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి. ఈ దాడిని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్పరాజ్ ఖండించారు. ఇది ఉగ్రదాడి అని ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదులు పిరికి చర్యల ద్వారా దేశం యొక్క సంకల్పాన్ని బలహీనపరచలేరని ఆయన అన్నారు. ప్రజలు, భద్రతా దళాల త్యాగాలు వృధా కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :