Monday, 15 December 2025 01:13:41 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

America Temple: ఆలయ గోడలపై విద్వేష రాతలు.. అమెరికాలో ఘటన

Date : 26 September 2024 12:22 PM Views : 262

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికాలోని ఆలయ గోడలపై హిందూ విద్వేష రాతలు దర్శనమిచ్చాయి.. కాలిఫోర్నియాలోని స్వామినారాయణ్ మందిర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ గోడలను పాక్షికంగా ధ్వంసం చేసిన దుండగులు.. హిందువులంతా వెనక్కి వెళ్లిపోవాలంటూ గోడపై పెయింట్ తో రాశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ లు టెర్రరిస్టులని, మోదీ హిట్లర్ అని గోడలపై రాశారు. ఈ ఘటనతో శాక్రిమెంటోలోని హిందువులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ విద్వేష రాతలపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాక్రిమెంటో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశోధన చేపట్టారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో కేసు దర్యాఫ్తు ప్రారంభించారు. గడిచిన పది రోజులలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండవ సారి కావడం గమనార్హం. ఇటీవల న్యూయార్క్ లోని స్వామినారాయణ్ మందిర్ వద్ద కూడా దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ విద్వేష రాతలకు సంబంధించిన ఫొటోలను స్వామి నారాయణ్ మందిర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మహంత్ స్వామి మహారాజ్ బోధనలు గుర్తుచేసుకుంటూ విద్వేషాన్ని తరిమికొట్టేందుకు, ఐకమత్యాన్ని చాటిచెప్పేందుకు మరింత నిబద్ధతతో ప్రచారం సాగిస్తామని తెలిపింది. ఈ ఘటనను మందిర్ కమ్యూనిటీ మొత్తం తీవ్రంగా ఖండించినట్లు పేర్కొంది. మరోవైపు, ఈ ఘటనపై భారత సంతతికి చెందిన చట్ట సభ్యుడు అమి బెరా స్పందించారు. విద్వేష రాతలను ఆయన ఖండించారు. శాక్రిమెంటో కౌంటీలో జాతి, మతం సహా ఎలాంటి విద్వేషాలకు తావులేదని తేల్చిచెప్పారు. మతం ఏదైనా మన కమ్యూనిటీలో అభద్రతాభావానికి చోటులేదని, అందరూ గౌరవంగా, సెక్యూర్డ్ గా ఉండేలా మనమంతా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :