Thursday, 05 December 2024 09:03:23 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

అణ్వాయుధాలతో దాడి అంటూ.. హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Date : 26 September 2024 11:40 AM Views : 17

Studio18 News - అంతర్జాతీయం / : రష్యాపై ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. రష్యాలోని మందుగుండు సామగ్రి డిపోపై ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. దీంతో రష్యా మరింత అప్రమత్తమైంది. అంతేగాక, రష్యాపై ఉక్రెయిన్ నుంచి క్షిపణులతో దాడి జరగొచ్చంటూ తమ దేశ నిఘావర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ అత్యున్నత భద్రతా కౌన్సిల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమ దేశాలకు ‘న్యూక్లియర్ వార్నింగ్’ ఇచ్చారు. రష్యాపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేయడానికి ఉక్రెయిన్‌కు అమెరికా, యూకే సహా పశ్చిమ దేశాలు అనుమతిస్తే తాము అణ్వాయుధాలతో దాడి చేస్తామని పుతిన్ హెచ్చరించారు. యూకేకు చెందిన స్టార్మ్ షాడో క్రూయిజ్ క్షిపణిని రష్యాపై దాడి చేయడానికి వాడేలా యూకే గతవారం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలవడానికి వాషింగ్టన్ డీసీకి కూడా వెళ్లారు. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ నుంచి ఆయుధాలతో దాడి చేయడంపై కైర్ స్టార్మర్, జో బైడెన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఇటీవల రష్యా నిఘా శాఖ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో యుద్ధం వేళ పశ్చిమ దేశాల జోక్యం మరింత పెరగడంతో తమ దేశ అణ్వాయుధ నియమ నిబంధనలను సవరించడం తప్పనిసరి అవుతోందని చెప్పింది. తమ దేశ భూభాగంపై క్రూయిజ్ క్షిపణులతో దాడి చేయడానికి ఉక్రెయిన్‌కు అమెరికా, యూకే సహా పశ్చిమ దేశాలు అనుమతివ్వనున్నట్లు వస్తున్న ప్రచారంపై పుతిన్ స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్‌కు ఇటువంటి అనుమతులను ఇస్తే పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధం చేస్తున్నట్లే. అటువంటిదే జరిగితే మేము అందుకు తగ్గ నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో 88 శాతం రష్యా, అమెరికా వద్దే ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :