Sunday, 25 January 2026 05:48:23 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Sunita Williams: 9 నెలల నిరీక్షణకు తెర.. భూమిని చేరుకున్న సునీత.. వీడియో ఇదిగో!

తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండైన డ్రాగన్ క్రూ అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది వ్యోమగాములను బయటకు తీసి జాన

Date : 19 March 2025 12:08 PM Views : 265

Studio18 News - అంతర్జాతీయం / : తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. సునీత, బుచ్ విల్మోర్‌‌, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండైంది. గంటకు దాదాపు 27 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చిన డ్రాగన్ క్రూ క్యాప్సుల్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక దాని 4 పారాచూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకుని సుమద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సుల్‌ను ఓ బోటుపైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం లోపలున్న వ్యోమగాములను బయటకు తీసి హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వారు భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉంటారు. కాగా, క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో విడిపోవడం దగ్గరి నుంచి వ్యోమగాములు భూమికి చేరడం వరకు ఈ మొత్తం కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :