Studio18 News - అంతర్జాతీయం / : దిత్వా తుపానుతో అతలాకుతలమైన శ్రీలంక ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ సహాయం దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతు గతేడాది నవంబర్ లో సంభవించిన దిత్వా తుపానుకు శ్రీలంక అతలాకుతలమైంది. శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో తుపాను తర్వాత భారత్ అత్యవసర సహాయ సామగ్రితో పాటు సైనికులను పంపించగా.. ఇప్పటికీ అక్కడే ఉన్న భారత సైనికులు పలుచోట్ల వంతెనలు పునర్నిర్మిస్తున్నారు. అనంతరకాలంలో శ్రీలంకలో పర్యటించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు, రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.45 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. తుపాను కారణంగా సెంట్రల్ ప్రావిన్స్-ఉవా ప్రావిన్స్ మధ్య వంతెన కూలిపోయింది. దీంతో ఆ రెండు ప్రావిన్స్ ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారత సైన్యం సహకారంతో స్థానిక అధికారులు అక్కడ బెయిలీ వంతెన నిర్మించారు. దీనిని ఆదివారం ప్రారంభించగా.. స్థానిక విద్యార్థిని ఒకరు భారత సైన్యానికి థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Admin
Studio18 News