Wednesday, 25 June 2025 07:25:48 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం!

Date : 22 May 2025 12:33 PM Views : 47

Studio18 News - అంతర్జాతీయం / : ఉత్తర కొరియాలో బుధవారం ఓ నూతన డిస్ట్రాయర్ యుద్ధనౌక జలప్రవేశ కార్యక్రమం అపశ్రుతితో ముగిసింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనతో ఉత్తర కొరియా నౌకాదళ విస్తరణ ప్రణాళికలకు ఆరంభంలోనే కొంత ఆటంకం ఏర్పడినట్లయింది. సిబ్బంది అనుభవరాహిత్యంతో కూడిన కమాండ్, కార్యాచరణలో నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం కారణంగా యుద్ధనౌకలోని కీల్ (నౌక కింది పొడవైన భాగం) కొన్నిచోట్ల ధ్వంసమైందని, నౌక ముందు భాగం షిప్‌వే నుంచి బయటకు రాలేకపోయిందని కేసీఎన్ఏ తన నివేదికలో పేర్కొంది. దీంతో నౌక జలప్రవేశం నిలిచిపోయింది. ఈ ‘బాధ్యతారహితమైన తప్పిదాలకు’ పాల్పడిన వారిపై వచ్చే నెలలో జరగనున్న పార్టీ సెంట్రల్ కమిటీ ప్లీనరీ సమావేశంలో కఠిన చర్యలు తీసుకుంటామని కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాకుండా, దెబ్బతిన్న యుద్ధనౌకకు జూన్ లోగా మరమ్మతులు పూర్తి చేసి, సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలోనే కిమ్ జోంగ్ ఉన్ ఈ కొత్త 5,000 టన్నుల బరువున్న డిస్ట్రాయర్‌ను ఆవిష్కరించారు. తన అణుసాయుధ సైనిక దళం కార్యాచరణ పరిధిని విస్తరించడంలోనూ, ముందస్తు దాడి సామర్థ్యాలను పెంచుకోవాలన్న తన లక్ష్యంలో ఇదో కీలక ముందడుగు అని అప్పట్లో ఆయన ప్రకటించారు. అమెరికా, ఆసియాలోని దాని మిత్రదేశాల నుంచి ఎదురవుతున్నాయని భావిస్తున్న ముప్పునకు ప్రతిస్పందనగానే ఈ ఆయుధ సమీకరణ చేపడుతున్నట్టు కిమ్ పలుమార్లు తెలిపారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా, దాని మిత్రపక్షాలు సంయుక్త సైనిక విన్యాసాలను విస్తృతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తన నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో అణుశక్తితో నడిచే జలాంతర్గామిని సమకూర్చుకోవడమే తన తదుపరి ప్రధాన లక్ష్యమని కూడా కిమ్ గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :