Wednesday, 25 June 2025 06:43:35 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు

Date : 22 May 2025 12:23 PM Views : 52

Studio18 News - అంతర్జాతీయం / : హమాస్ కీలక నేత మొహమ్మద్ సిన్వర్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో మరణించి ఉండవచ్చని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు ఐదు నెలల విరామం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది మే నెల ఆరంభంలో దక్షిణ గాజాలోని ఓ ఆసుపత్రి లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల సమయంలోనే మొహమ్మద్ సిన్వర్ మరణించి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను హమాస్ సంస్థ ఇంతవరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. గతంలో హమాస్ నేత యాహ్యా సిన్వర్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడైన మొహమ్మద్ సిన్వర్, ఆ తర్వాత గాజాలో హమాస్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మొహమ్మద్ సిన్వర్ కూడా మరణించినట్లు నెతన్యాహు చేసిన ప్రకటనతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. జెరూసలేంలో జరిగిన మీడియా సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ, ఇప్పటివరకు సుమారు 10,000 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. హనియే, యాహ్యా సిన్వర్ వంటి కీలక హంతకులను కూడా తాము అంతమొందించామని ఆయన గుర్తుచేశారు. తాజాగా మొహమ్మద్ సిన్వర్ కూడా హతమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గాజాపై పూర్తి నియంత్రణ సాధించే వరకు సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాలోకి మానవతా సాయంతో వెళ్తున్న ట్రక్కులను అనుమతిస్తున్నప్పటికీ, ఆ సరుకులు సామాన్య పౌరులకు చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 11 వారాల దిగ్బంధనం అనంతరం గాజాలోకి 100 సహాయ ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించింది. అమెరికాతో తమకు విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న ఊహాగానాలను నెతన్యాహు కొట్టిపారేశారు. బందీలుగా ఉన్నవారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం కోసం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. లేనిపక్షంలో, గాజాపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించేందుకు సైనిక చర్యలతో ముందుకు సాగుతామని నెతన్యాహు తేల్చి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :