Sunday, 08 March 2026 10:51:02 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అరెస్ట్ వెనక అసలు కారణం వేరే ఉందట.. వెల్లడించిన అమెరికా

భారత్‌లో నేరాలకు, ఈ అరెస్టుకు సంబంధం లేదన్న యూఎస్ అక్రమ పత్రాలతో దేశంలో ప్రవేశించడంతోనే అరెస్ట్ చేశామన్న అధికారులు భారత్‌కు అప్పగించే అవకాశం

Date : 20 November 2024 03:32 PM Views : 346

Studio18 News - అంతర్జాతీయం / : కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అమెరికా పోలీసులు గత గురువారం అరెస్ట్ చేశారు. తాజాజా, ఈ అరెస్ట్ వెనకున్న కారణం తెలిసింది. అక్రమ పత్రాలతో అతడు దేశంలోకి ప్రవేశించడంతో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యసహా పలు హై ప్రొఫైల్ హత్యలతో సంబంధం ఉన్న అన్మోల్‌ కోసం భారత్ వెతుకుతోంది. ఇటీవల ఈ గ్యాంగ్ మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని హత్య చేసింది. అన్మోల్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరుతోంది. ఈ క్రమంలో అమెరికా పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో నేరాలకు సంబంధించి అతడిని అరెస్ట్ చేసినట్టు తొలుత వార్తలొచ్చాయి. అయితే, అతడి అరెస్ట్ వెనకున్న అసలు కారణం అది కాదని, అక్రమ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడమే అరెస్ట్ కు అసలు కారణమని యూఎస్ అధికారులు తెలిపారు. అంతేకాదు, అతడిని తమకు అప్పగించాలంటూ ఈ నెల మొదట్లో భారత్ చేసిన అభ్యర్థనకు అనుగుణంగా అన్మోల్‌ను భారత్‌కు అప్పగించే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే, అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని యూఎస్ ప్రభుత్వం భారత్‌తో పంచుకుంది. ప్రస్తుతం అతడు అయోవా రాష్ట్రంలోని పొట్టవాట్టమీ కౌంటీ జైలులో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Also Read : బీపీ చెక్​ చేసుకుంటున్నారా... సరైన రీడింగ్​ రావాలంటే ఇలా చేయాలి!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :