Monday, 15 December 2025 01:09:31 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Russian Jet: అమెరికా గగనతలంలోకి రష్యా యుద్ధ విమానం..

Date : 01 October 2024 12:11 PM Views : 255

Studio18 News - అంతర్జాతీయం / : రష్యా యుద్ధ విమానం ఒకటి అమెరికా గగనతలంలోకి దూసుకు వచ్చింది. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న అమెరికా ఫైటర్ జెట్ పక్క నుంచి వేగంగా వెళ్లిపోయింది. రష్యా విమానం అత్యంత సమీపంలోకి రావడంతో అమెరికా పైలట్ తన జెట్ ను ఓ పక్కకు వంచడం వీడియోలో కనిపిస్తోంది. ఈ నెల 23న నార్తర్న్‌ అమెరికన్‌ ఏరోస్పేస్‌ కమాండ్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. రష్యా యుద్ధ విమానాన్ని తరిమికొట్టేందుకు ఎఫ్ - 16 ఫైటర్ జెట్ ను ప్రయోగించాల్సి వచ్చిందని తెలిపారు. దీనిపై అమెరికా వాయుసేన ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రష్యన్ ఎంబసీకి సమాచారం అందించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఏరోస్పేస్ కమాండ్ చీఫ్ జనరల్ గ్రెగరీ గ్యూలాంట్ ఈ ఘటనపై స్పందిస్తూ.. రష్యాకు చెందిన సుఖోయ్ -35 యుద్ధ విమానం తమ ఫైటర్ జెట్ కు అత్యంత సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా రష్యా పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మండిపడ్డారు. అమెరికా గగనతలంపైకి వచ్చిన రష్యన్ యుద్ధ విమానాన్ని ఎఫ్ - 16 ఫైటర్ జెట్ తో తరిమికొట్టినట్లు తెలిపారు. కాగా, రష్యన్ యుద్ధ విమానాలు ఇటీవలి కాలంలో అమెరికా వైపు దూసుకు రావడం ఇది తొమ్మిదో ఘటన. ఎనిమిది రష్యా ఫైటర్ జెట్లు, నాలుగు యుద్ధ నౌకలు, రెండు సబ్ మెరీన్లు అమెరికా వైపు దూసుకొచ్చాయి. రష్యన్ యుద్ధ నౌకలు అమెరికా సముద్ర సరిహద్దును దాటి 30 మైళ్లు లోపలికి వచ్చినట్లు గ్యూలాంట్ తెలిపారు. జులైలో రష్యా, చైనా బాంబర్‌ విమానాలు అలాస్కా గగనతలానికి అత్యంత సమీపంలో ప్రయాణించాయని అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :