Monday, 08 December 2025 03:17:03 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Anura Dissanayake: శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా దిస్సనాయకే ప్రమాణం.. తొలి లెఫ్ట్ పార్టీ నేతగా రికార్డు

Date : 23 September 2024 01:10 PM Views : 191

Studio18 News - అంతర్జాతీయం / : శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే (55) ప్రమాణస్వీకారం చేశారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశంలో మొన్న అధ్యక్ష ఎన్నికలు జరగ్గా అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత దిస్సనాయకే, సమగి జన సంధానయ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఇద్దరూ గెలుపునకు అవసరమైన ఓట్లను పొందడంలో విఫలమయ్యారు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడంతో దిస్సనాయకే విజయం ఖరారైంది. నిన్న సాయంత్రం ఏడు గంటలకు తుది ఫలితం ప్రకటించిన తర్వాత దిస్సనాయకే మాట్లాడుతూ.. శతాబ్దాలుగా మనం పెంచుకున్న కల ఎట్టకేలకు సాకారం కాబోతోందని పేర్కొన్నారు. ఈ ఘతన ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదని, వేలాదిమంది సమష్టి కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. మీ నిబద్ధతే ఇంతదూరం తీసుకొచ్చిందని, ఈ విజయం అందరిదీ అని పేర్కొన్నారు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దిస్సనాయకేకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. దిస్సనాయకే విజయం తర్వాత భారత హైకమిషనర్ వెంటనే ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :