Thursday, 12 March 2026 03:18:01 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Israel: లెబనాన్ లో 500 మందిని మట్టుబెట్టిన తర్వాత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని సందేశం

Date : 24 September 2024 11:44 AM Views : 236

Studio18 News - అంతర్జాతీయం / : లెబనాన్ లోని హిజ్బుల్లా తీవ్రవాదుల స్థావరాలను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ దాడులలో దాదాపు 500 మందికి పైగా చనిపోయారని లెబనాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ‘ఆపరేషన్ నార్తర్న్ యారోస్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో లెబనాన్ భూభాగంపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు మొత్తంగా 492 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 35 మంది చిన్నారులు, 58 మహిళలు కూడా ఉన్నారని పేర్కొంది. ఈ క్రమంలోనే లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నది లెబనాన్ ప్రజలతో కాదని ఈ సందేశంలో ఆయన స్పష్టం చేశారు. చాలాకాలంగా హిజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారని గుర్తుచేశారు. కాగా, దాడులు మొదలుపెట్టక ముందే లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లకుంటే 80 వేల మంది వరకు చనిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. నెతన్యాహు సందేశం సారాంశం.. ‘హిజ్బుల్లా తీవ్రవాదులు మిమ్మల్ని (లెబనాన్ ప్రజలు) మానవ కవచాలుగా వాడుకుంటున్నారు. మీ లివింగ్ రూములలో రాకెట్లు పెట్టారు. మీ గ్యారేజ్ లలో మిస్సైళ్లను దాచారు. ఆ రాకెట్లు, మిస్సైళ్లు నేరుగా ఇజ్రాయెల్ లోని పౌరుల ఇళ్లపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. మా పిల్లాపాపలను కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మేం మా ఆయుధాలను బయటకు తీయాల్సి వచ్చింది. హిజ్బుల్లా తీవ్రవాదులు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి మీ ప్రాణాలను అడ్డుగా పెట్టుకుంటున్నారు. దయచేసి ఈ విషయంలో వారికి ఎలాంటి సాయం చేయొద్దు. మీ మీ ఇళ్ల నుంచి దూరంగా వెళ్లిపోండి. మీవి, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోండి. మా ఆపరేషన్ పూర్తయ్యాక మళ్లీ తిరిగి రావొచ్చు. అంతేకాని అక్కడే ఉండి హిజ్బుల్లా తీవ్రవాదులకు మానవ కవచాలుగా మారొద్దు’ అంటూ లెబనాన్ ప్రజలకు నెతన్యాహు విజ్ఞప్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :