Saturday, 07 March 2026 07:58:43 PM
# కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..? # గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌

Date : 14 May 2025 03:51 PM Views : 267

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌స్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రియాద్‌ చేరుకున్న ట్రంప్‌... ఈ న‌గ‌రాన్ని ప్రపంచ ప్రధాన వ్యాపార కేంద్రంగా మార్చినందుకు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను ప్రశంస‌ల‌తో ముంచెత్తారు. ఈ సంద‌ర్భంగా సౌదీ యువరాజుకు ట్రంప్ ఓ వింత‌ ప్రశ్న వేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ అవుతోంది. "మహమ్మద్‌.. మీరు రాత్రి పూట నిద్రపోతారా..? మీరు ఎలా నిద్రపోతారు? సౌదీని ఎంతో గొప్పగా చేశారు. మాలో ఒకరిలా ఉంటూనే.. ఇంతలా ఎలా అభివృద్ధి చేశారు. సౌదీ అరేబియా అభివృద్ధిపై విమర్శకులకు ఎన్నో అనుమానాలు ఉండేవి. వారి అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ అభివృద్ధి చేసి చూపించారు. సౌదీని శక్తిమంతమైన వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దారు. నాకు మీరంటే ఎంతో అభిమానం" అంటూ సౌదీ ప్రిన్స్‌పై ట్రంప్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇక‌, ఇదే స‌మావేశంలో సిరియాపై ఉన్న ఆంక్ష‌ల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ట్రంప్‌ ప్ర‌క‌టించారు. తుర్కియే అధ్యక్షుడు త‌య్యిప్ ఎర్డోగాన్ అభ్య‌ర్థ‌న మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :