Wednesday, 10 December 2025 02:32:15 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

israel - Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి .. 130 మందికిపైగా మృతి

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు ఇటీవలే ముగిసిన కాల్పుల విరమణ తొలి ఒప్పందం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించేందుకు అంగీకరించని హమాస్

Date : 18 March 2025 10:15 AM Views : 234

Studio18 News - అంతర్జాతీయం / : ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గాజాపై టెల్‌అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 130 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో గాజాలోని హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్, ఐఎస్ఏ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించుటకు హమాస్ అంగీకరించని కారణంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ చెరలో ఉన్న 30 మందికిపైగా బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా, ప్రతిగా 2వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, ఆ చర్చలు జరగలేదు. తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించగా, టెల్ అవీవ్ అంగీకరించింది. కానీ హమాస్ నిరాకరించింది. దీంతో హమాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ముందుగా గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. తాజాగా వైమానిక దాడి చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :