Thursday, 05 December 2024 09:42:28 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

PM Modi: మీరు భారతదేశపు బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికాలోని ప్ర‌వాస భార‌తీయుల‌తో ప్ర‌ధాని మోదీ!

Date : 23 September 2024 12:28 PM Views : 44

Studio18 News - అంతర్జాతీయం / : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం అమెరికా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆదివారం ఆయ‌న లాంగ్ ఐలాండ్‌లో భార‌తీయ ప్ర‌వాసుల‌తో స‌మావేశమ‌య్యారు. లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కొలీజియంలో జరిగిన 'మోదీ అండ్ యూఎస్‌' గ్రాండ్ కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పదివేల మంది భారతీయ-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. అంత‌కుముందు స్టేడియంలో ప్రధాని రాక కోసం ఎదురుచూసిన ప్ర‌వాసులను వరుస సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఇక ప్రధాని ప్ర‌సంగించేందుకు వేదికపైకి వెళుతుండగా 'మోదీ, మోదీ' నామస్మ‌ర‌ణ‌తో స్టేడియం హోరెత్త‌డం గ‌మ‌నార్హం. 'భారత్ మాతా కీ జై!' నినాదంతో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'నమస్తే' కూడా లోకల్‌ నుంచి గ్లోబల్‌గా మారిందని, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకే ఈ ఘనత ద‌క్కుతుంద‌ని మోదీ అన్నారు. ఈ సంద‌ర్భంగా మోదీ అమెరికాలో తన మునుపటి కమ్యూనిటీ ఈవెంట్‌లను గుర్తు చేసుకున్నారు. 2014 మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో, 2016 కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో, 2018లో హ్యూస్టన్, టెక్సాస్‌లో, 2023 వాషింగ్టన్‌లో, ఇప్పుడు లాంగ్ ఐలాండ్‌లో అంటూ మోదీ చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య వారధిగా ఉంటూ భారత్-అమెరికా బంధాన్ని బలోపేతం చేయ‌డంలో భార‌తీయ ప్ర‌వాసులు ఎంతో దోహదపడ్డార‌ని ఆయన అన్నారు. "మీరందరూ ఏడు సముద్రాలు దాటి వచ్చారు. కానీ మీ హృదయాలు, ఆత్మల నుండి భారతదేశంపై ఉన్న‌ ప్రేమను ఏదీ తీసివేయలేదు" అని ప్ర‌ధాని మోదీ చెప్పారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు విదేశాల్లో స్థిరపడి ఉండవచ్చు. ఇక్కడ ఉన్న‌వారు అమెరిక‌న్‌ పౌరులుగా మారొచ్చు. అయితే మనందరినీ ఒకచోట చేర్చే సెంటిమెంట్ ఏమిటంటే, 'భారత్ మాతా కీ జై!'... ఇది ఎప్ప‌టికీ మార‌దు. మ‌నం ఎక్క‌డ ఉన్నా మ‌న‌ల్ని ఇది క‌లుపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని ప్ర‌ధాని తెలిపారు. "ఈ సెంటిమెంట్ మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇదే మ‌న‌ అతిపెద్ద బలం. ఈ సెంటిమెంట్ శాంతియుతంగా, చట్టాన్ని గౌరవించే ప్రపంచ పౌరులుగా ఉండటానికి మ‌న‌కు సహాయపడుతుంది. భారతదేశం ప్రపంచ 'విశ్వ-బంధు' అని ప్రపంచాన్ని గ్రహించేలా చేస్తుంది" అని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇక అమెరికాలో స్థిరపడిన భారతీయులను 'రాష్ట్రదూత్' (రాయబారులు) అని పిలిచారు ప్రధాని. ఆ దేశంలో భారతదేశం సంపాదించిన గౌరవానికి, అక్క‌డి భారతీయ సమాజానికి ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మన భారతీయ విలువలు, సంస్కృతి మనల్ని ఒకటిగా మార్చాయని మోదీ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :