Studio18 News - అంతర్జాతీయం / : రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ఆర్ధికవృద్ధిపై ప్రశంసలు కురిపించారు. అనేక బ్రిక్స్ దేశాలకు భారత్ ఓ ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరైనందుకు భారత ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఆర్ధిక వృద్ధిని పెంచేందుకు అవసరమైన అంశాలపై మనమందరం చర్చించుకుంటున్నామని, ఈ విషయంలో మీరు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని మోదీని ఉద్దేశించి పుతిన్ అన్నారు. 7.5 శాతం వృద్ధి రేటు .. ఈ ఫలితాలపై మిమ్మల్ని అభినందిస్తున్నామని, తమ అందరికీ ఇదో ఉదాహరణగా నిలుస్తుందన్నారు. తీసుకుంటున్న చర్యలకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించిన నేపథ్యంలో పుతిన్ ఈ విధంగా స్పందించారు. కాగా, ఈ ఏడాది భారత ఆర్ధిక వృద్ధిరేటు 7 శాతంగా, వచ్చే ఏడాది 6.5 శాతంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.
Admin
Studio18 News