Studio18 News - అంతర్జాతీయం / : Israel Wars : ఆ దేశం యుద్ధంలోనే పుట్టింది. యుద్ధాలు చేస్తూనే ఎదిగింది. యుద్ధమే దాన్ని అస్తిత్వం అయిపోయింది. దాడులు, ప్రతిదాడులతో బలపడి ఎదురుగా వచ్చినోళ్లను వచ్చినట్లుగా వేసేసుకుంటూ వెళ్తోంది ఇజ్రాయెల్. దేశంగా ఏర్పడినప్పటి నుంచి అంతకంతకూ పటిష్టమై ఒక్కటై నిలబడి ఒంటరిగా పోరాడుతూ అరబ్ దేశాల పాలిట సింహ స్వప్నంగా నిలిచింది ఇజ్రాయెల్. మిడిల్ ఈస్ట్ లో తమ పేరు ఎత్తాలంటేనే ఏ దేశమైనా భయపడే పరిస్థితి తీసుకొచ్చింది. అసలు.. ఇజ్రాయెల్ ఎప్పుడు ఏర్పడింది? ఏయే దేశాలతో యుద్ధాలు చేసింది? అసలు యుద్ధాలు ఎందుకు చేస్తోంది? పగ, ప్రతీకారం.. ఆశ, అవసరం, ఆశయం.. ఇవే ఇజ్రాయెల్ యుద్ధానికి కారణం. బలపడి నిలబడాలన్న ఆశ. శత్రు దేశాలను పగ, ప్రతీకారంతో.. అరబ్ దేశాల అంతు చూస్తూ వస్తోంది ఇజ్రాయెల్. రేపటి కోసం, బంగారు భవిష్యత్తు కోసం.. పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ తో పాటు హిజ్బొల్లా, హమాస్, మిలిటెంట్ సంస్థల మీద విరామం లేని పోరాటం చేస్తోంది. తాను వెళ్తున్న మార్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్నిసార్లు ఓడినా పడి లేచిన కెరటమై పాము కంటే డేంజర్ గా బుస కొడుతోంది. ఇంతకీ పాలస్తీనాతో ఇజ్రాయెల్ వైరమేంటి? ఇరాన్ తో ఎక్కడ జరిగింది. హమాస్, లెబనాన్ తో గొడవేంటి? కారణం ఏదైనా యుద్ధం మాత్రం కామన్. ఓడినా గెలిచినా.. ఏదో ఒకటి తేల్చుకోవడమే. అస్తిత్వ పోరాటంలో తలపడి నిలబడిన ఇజ్రాయెల్.. పాలస్తీనాతో మొదలై ఇరాన్ వరకు.. పలు దేశాలు, మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ చరిత్రకు చిక్కలేనంత వైరం ఉంది. అది రోజురోజుకు ఇంతింతై పెద్దదవుతోంది. అంతకంతకూ జఠిలమవుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలెంలోని అల్ అక్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. క్రైస్తవులు, ముస్లింలు, యూదులు పవిత్రంగా భావించే అల్ అక్సాలో రెండు ప్రార్థనా స్థలాలు గతంలో ధ్వంసమయ్యాయి. వాటిని తిరిగి కట్టడంతో యూదులు తమకు ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలన్న వాదనతో వివాదం మొదలై యుద్ధాలకు దారితీసింది.
Admin
Studio18 News