Wednesday, 30 April 2025 05:01:15 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Bunker Busters: బంకర్ బస్టర్ బాంబులు.. ఎలా పనిచేస్తాయంటే..!

Date : 30 September 2024 02:45 PM Views : 65

Studio18 News - అంతర్జాతీయం / : ఇజ్రాయెల్ దాడులకు భయపడి అండర్ గ్రౌండ్ లోనే ఉంటున్న హిజ్బుల్లా చీఫ్ హనన్ నస్రల్లాను బంకర్ బస్టర్ బాంబులతో ఇజ్రాయెల్ వాయుసేన తుదముట్టించింది. అపార్ట్ మెంట్ కింద దుర్భేద్యంగా నిర్మించిన బంకర్ ను ఈ బాంబులు పేల్చేశాయి. భూమి లోపలకి చొచ్చుకెళ్లి పేలిపోవడంతో నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లు చనిపోయారు. ఈ దాడికి ఇజ్రాయెల్ ఉపయోగించిన బంకర్ బస్టర్ బాంబులు ఎలా పనిచేస్తాయి.. టార్గెట్ ను ఎలా ఛేదిస్తాయనే వివరాలు.. బంకర్ బస్టర్.. శత్రువుల దాడుల నుంచి రక్షణ కోసం భూమి పైన, భూగర్భంలో బంకర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులు ఇలాంటి బంకర్లలోనే తలదాచుకుని ఇజ్రాయెల్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ఇజ్రాయెల్ లోనూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం పలు బంకర్లను నిర్మించింది. వైమానిక దాడులను ముందుగా గుర్తించి సైరన్ మోగించడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ సైరన్ మోత వినిపించగానే జనం తమ దగ్గర్లోని బంకర్లలోకి, భూగర్భంలోని రైల్వే స్టేషన్లలోకి వెళ్లి బాంబు దాడుల నుంచి రక్షణ పొందుతారు. కాంక్రీట్ తో పాటు ఉక్కును ఉపయోగించి ఈ బంకర్లను నిర్మిస్తారు. సాధారణ బాంబులు మీద పడినా ఈ బంకర్లు చెక్కుచెదరవు. హిజ్బుల్లా, హమాస్ సహా పలు తీవ్రవాద సంస్థలు తమ లీడర్లను కాపాడుకోవడానికి ఇలాంటి బంకర్లనే ఉపయోగిస్తున్నాయి. ఇలా బంకర్ లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగిస్తోంది. లెబనాన్ లో అండర్ గ్రౌండ్ బంకర్ లో దాక్కున్న నస్రల్లాను ఈ బాంబులతోనే తుదముట్టించింది. ఈ బాంబులు ఎలా పనిచేస్తాయంటే... సాధారణ క్షిపణులు టార్గెట్ పైన పడగానే పేలిపోతాయి. దీంతో చుట్టుపక్కల కొంతమేర విధ్వంసం జరుగుతుంది. నిర్మాణాలు కూలిపోతాయి. బంకర్ బస్టర్ బాంబులు నేల మీద పటిష్ఠంగా నిర్మించిన బంకర్ లలోకి చొచ్చుకెళ్లి ఆ తర్వాత పేలతాయి. భూగర్భంలోని బంకర్ లను టార్గెట్ చేస్తే.. భూమిని చీల్చుకుంటూ కొన్ని మీటర్ల లోపలికి చొచ్చుకువెళ్లి పేలిపోతాయి. దీంతో అండర్ గ్రౌండ్ బంకర్ లో దాక్కున్న వారంతా క్షణాలలో ప్రాణాలు కోల్పోతారు. భూమి లోపలికి దాదాపు 30 మీటర్లు చొచ్చుకెళ్లే సామర్థ్యం ఈ బాంబులకు ఉంది. ఏకంగా ఆరు మీటర్ల మందంతో నిర్మించిన గోడను కూడా ఇవి చీల్చుకుంటూ వెళతాయి. ఈ బాంబులు ఒక్కోటీ టన్నుల కొద్దీ బరువుంటాయి. నస్రల్లాను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ వాడిన బంకర్ బస్టర్ బాంబుల పేరు జీబీయూ-39, జీబీయూ-28.. ఇవి అమెరికాలో తయారయ్యాయి. ఒక్కొక్కటీ టన్ను నుంచి రెండు టన్నుల బరువు ఉంటాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ బాంబుల వాడకంపై నిషేధం ఉంది. జెనీవా కన్వెన్షన్ లో ఇందుకోసం పలు దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :