Studio18 News - అంతర్జాతీయం / : Israel Hezbollah War : లెబనాన్ లో హెజ్బొల్లాను వెంటాడి వేటాడి ఖతం చేసే పనిలో ఉంది ఇజ్రాయల్. హెజ్బొల్లాను ఒక అడుగు వేసితే, ఇజ్రాయల్ 100 అడుగులు ముందుకు వేస్తోంది. హెజ్ బొల్లా తొడ కొడితే.. ఇజ్రాయల్ మెడ తీసేస్తామంటోంది. ఓ రకంగా హెజ్బొల్లా వెన్నులో వణుకుపుట్టేలా ఇజ్రాయల్ విజృంభిస్తోంది. టాప్ రేంజ్ కమాండర్ స్థాయి అధికారులే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలువురు హెజ్బొల్లా కమాండర్లను ఖతం చేసింది. ఇప్పుడు నెంబర్ 2 గా ఉన్న ఇబ్రహీం అకీల్ ని లేపేసింది. 300 హెజ్బొల్లా స్థావరాలపై భీకర దాడులతో మరణ మృదంగం మోగిస్తోంది ఇజ్రాయల్. ఎక్కడ నక్కినా, ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ప్లాన్ చేద్దామని స్కెచ్ వేసినా.. వెంటనే హెజ్బొల్లాకు చావుని పరిచయం చేస్తోంది ఇజ్రాయెల్. ఈ వేటలో వరుసగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తోంది. ఇప్పటికే హెజ్బొల్లాలో టాప్ కమాండర్లుగా ఉన్న వాళ్లను వన్ బై వన్ లేపేస్తూ వచ్చింది. ఇక నెక్ట్స్ టార్గెట్.. హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లానే. దీంతో ఆ గ్రూపులో దడ పుడుతోంది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో భారత బలగాలు అలర్ట్ అయ్యాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. యూఎన్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ మిషన్ లో భాగంగా 600 మంది భారత సైనికులు ఇజ్రాయల్-లెబనాల్ బోర్డర్ లో మోహరించారు. శాంతి స్థాపనలో సహకరించడం, దాడులు తీవ్రం కాకుండా నివారిండచం వీరి బాధ్యత. తాజా దాడుల నేపథ్యంలో పరిస్థితులను గమనిస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
Admin
Studio18 News