Saturday, 07 March 2026 08:28:44 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషం.. ఎయిర్‌పోర్ట్‌లో నేలకేసి నొక్కి చేతులకు సంకెళ్లు

భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషంగా ప్రవర్తించారు. విమానం దిగిన అతడ్ని ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి

Date : 09 June 2025 08:47 PM Views : 339

Studio18 News - అంతర్జాతీయం / : భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషంగా ప్రవర్తించారు. విమానం దిగిన అతడ్ని ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. (Indian student pinned to ground) చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి బహిష్కరించారు. సోషల్ మీడియా యూజర్, సామాజిక వ్యవస్థాపకుడు కునాల్ జైన్ ఈ దారుణం గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నిన్న రాత్రి న్యూయార్క్ విమానాశ్రయంలో యువ భారతీయ విద్యార్థి చేతికి సంకెళ్లు వేశారు. ఏడుస్తున్న అతడి పట్ల నేరస్థుడిలా ప్రవర్తించడాన్ని నేను చూశా. తన కలల కోసం అతడు వచ్చాడు. ఎలాంటి హాని కలిగించలేదు. ఒక ఎన్‌ఆర్‌ఐగా నేను నిస్సహాయంగా ఉండిపోయా. హృదయ విదారకంగా భావించా. ఇది ఒక మానవ విషాదం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, ఆ భారతీయ విద్యార్థి హర్యానాలో మాట్లాడినట్లు కునాల్ జైన్ తెలిపారు. వీసా పొంది అమెరికా వచ్చే ఇలాంటి పిల్లలు తాము ఎందుకు వచ్చామో అన్నది ఇమ్మిగ్రేషన్ అధికారులకు వివరించలేక పోతున్నారని అన్నారు. దీంతో వారి పట్ల ఇలా ప్రవర్తించి, సంకెళ్లు వేసి తిరుగు విమానంలో పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఇలాంటి కేసులు మూడు, నాలుగు జరుగుతున్నాయని ఆరోపించారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీటిపై స్పందించాలని జైన్ కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :