Studio18 News - అంతర్జాతీయం / : ఘోర బస్సు ప్రమాదం జరిగింది.. రిపోర్టర్ అందుకు సంబంధించిన సమాచారాన్ని లైవ్‌లో క్షేత్రస్థాయి నుంచి అందిస్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డ్యాన్స్ చేసిన యువకుడు మరెవరో కాదు.. బ్రెజిలియన్ ఫంక్ ఆర్టిస్ట్ మెక్ లివిన్హో (29). బ్రెజిల్‌లోని వయా డ్యూత్రా హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు. అక్కడి నుంచి యాంకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా విజువల్స్ చూపిస్తూ సమాచారం అందిస్తోంది. ఆ కవరేజీకి అంతరాయం కలిగిస్తూ లినిన్హో డ్యాన్స్ చేశాడు. అంత సీరియస్ విషయంపై రిపోర్టర్ సమాచారం అందిస్తున్న వేళ అతడు చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డ్యాన్స్ చేయొద్దని, పక్కకు తప్పుకోవాలని లివిన్హోకు కెమెరామన్ చెప్పినప్పటికీ అతడు తప్పుకోకుండా డ్యాన్స్ కంటిన్యూ చేశాడు. ఈ వీడియోను డైలీ మెయిల్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘బ్రెజిల్‌లో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక టెలివిజన్ రిపోర్టర్ సమాచారం అందిస్తుండగా ఆమె వెనుక ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డ్యాన్స్ చేశాడు. అతడిపై విమర్శలు వస్తున్నాయి’ అని పేర్కొంది.
Admin
Studio18 News