Studio18 News - అంతర్జాతీయం / : Iran Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇరాక్ దాడులకు కౌంటర్ ఇచ్చేందుకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. అయితే ఇజ్రాయెల్ దూకుడు అమెరికాకు టెన్షన్ పెట్టిస్తోందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో బైడెన్ ప్రత్యేకంగా కాల్ లో మాట్లాడారు. ఇంతకీ అమెరికా ఆందోళనకు కారణం ఏంటి? ఆ ఒక్క విషయమే అగ్రరాజ్యాన్ని టెన్షన్ పెడుతోందా? ప్రపంచాన్ని మరింత భయపెడుతున్న ఇరాన్ పరీక్షలు? ఇజ్రాయెల్ దూకుడుకు అమెరికా ఓవైపు టెన్షన్ పడుతుంటే.. ఇరాన్ చర్యలు మరింత భయపెడుతున్నాయి. అణు పరీక్షలు చేపట్టిందంటూ జరుగుతున్న ప్రచారం ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. ఇంతకీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏ మలుపు తీసుకోబోతోంది? ఈ ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు పాల్పడుతామని వార్నింగ్.. పాలస్తీనా, లెబనాన్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ కు ఇరాన్.. హెచ్చరికలు చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ పై ఎలాంటి దాడులు జరగకూడదని, అలా జరిగితే ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు పాల్పడుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా.. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా తగ్గేదేలే అంటోంది.. ఇక అటు ఇజ్రాయెల్ కూడా తగ్గేదేలే అంటోంది. ఇరాన్ దాడులకు కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు చమురు క్షేత్రాలు, అణుస్థావరాల మీద దాడులకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఎప్పుడేం జరుగుతుందో అనే భయాలను క్రియేట్ చేస్తున్నాయి. ఒకే సమయంలో ఆ రెండు దేశాల భూభాగాల్లో సంభవించిన భూకంపం.. ఇలాంటి భయాల మధ్య ఇరాన్ చేసిన ఓ పని మరింత టెన్షన్ పెడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ పరాకాష్టకు తీసుకెళ్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5న రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూ భాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది.
Admin
Studio18 News