Thursday, 15 May 2025 03:18:42 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Donald Trump: మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొన్న ట్రంప్

వైట్ హౌస్ కు చేరిన టెస్లా కారు డిస్కౌంట్ అడగలేదన్న ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్ దేశభక్తుడంటూ ప్రశంసలు

Date : 12 March 2025 11:11 AM Views : 57

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎలాన్ మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొంటానని ఇటీవల చెప్పిన ట్రంప్.. తాజాగా ఓ రెడ్ కలర్ టెస్లా మోడల్ ఎక్స్ కారును సొంతం చేసుకున్నారు. ఇందుకోసం 80 వేల డాలర్లు చెల్లించానని, ఒక్క డాలర్ కూడా డిస్కౌంట్ తీసుకోలేదని ట్రంప్ వివరించారు. తాను అడిగితే మస్క్ డిస్కౌంట్ ఇస్తాడు కానీ టెస్లా కంపెనీ నుంచి తాను బెనిఫిట్స్ పొందానని విమర్శలు వస్తాయని చెప్పారు. మంగళవారం వైట్ హౌస్ ఆవరణలో టెస్లా కంపెనీకి చెందిన వివిధ మోడల్ కార్లు ప్రదర్శించారు. ఇందులో రెడ్ కలర్ కారును ట్రంప్ సెలక్ట్ చేసుకుని డబ్బు చెల్లించారు. అనంతరం మస్క్ తో కలిసి కారులో కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ సర్కారులో ఎలాన్ మస్క్ సలహాదారుగా వ్యవహరించడంపై అమెరికాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో మస్క్ జోక్యానికి నిరసనగా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల మస్క్ కు చెందిన టెస్లా కార్ షోరూం ముందు పలువురు నిరసనకారులు ఆందోళన చేశారు. ఈ నిరసనలు టెస్లా కార్ల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అమ్మకాలు తగ్గడంతో టెస్లా షేర్లు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడని కితాబునిచ్చారు. ఆయనకు మద్దతుగా తాను ఓ టెస్లా కారును కొనుగోలు చేస్తానని చెప్పారు. మంగళవారం ట్రంప్ కోసం పలు లేటెస్ట్ మోడల్ టెస్లా కార్లను ఎలాన్ మస్క్ వైట్ హౌస్ కు తెప్పించారు. ఆయా మోడల్ కార్ల ప్రత్యేకతలను ట్రంప్ కు మస్క్ దగ్గరుండి వివరించారు. దీంతో వైట్ హౌస్ కాస్తా కాసేపు టెస్లా షోరూంలాగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :